Ustaad Bhagat Singh: శ్రీలీలతో ప్రేమాయణం... ఫొటో హల్‌చల్
ABN, First Publish Date - 2023-04-11T10:12:49+05:30
‘పాటొచ్చి పదేళ్లు అయింది.. అయినా పవర్ తగ్గలా..’ ‘గబ్బర్‌సింగ్’లో (gabbarsingh)డైలాగ్ ఇది. పవన్‌కల్యాణ్(Pawan kalyan) - హరీశ్ శంకర్ (Harish shankar) కాంబినేషన్‌లో సినిమా వచ్చి 11 ఏళ్లు అవుతుంది.
‘పాటొచ్చి పదేళ్లు అయింది.. అయినా పవర్ తగ్గలా..’
‘గబ్బర్‌సింగ్’లో (gabbarsingh)డైలాగ్ ఇది.
పవన్‌కల్యాణ్(Pawan kalyan) - హరీశ్ శంకర్ (Harish shankar) కాంబినేషన్‌లో సినిమా వచ్చి 11 ఏళ్లు అవుతుంది.
ఆ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు సెట్ అవుతుందా అని అభిమానులు ఇన్ని సంవత్సరాలు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చింది ఒక చిత్రమే అయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. మళ్లీ పదకొండేళ్ల తర్వాత ఈ వీరిద్దరి కలయిక కుదిరింది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustaad Bhagat Singh). ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్‌లకు ఆస్కారముంది. ఒకరు ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో వస్తే.. మరొకరు ప్రజెంట్ జరుగుతున్న కథలో వస్తారని వినికిడి. ఇద్దరు కథానాయికల్లో శ్రీలీల ఓ పాత్రకు ఎంపికయ్యారు. మంగళవారు శ్రీలీల సెట్‌లో అడుగుపెట్టారని తెలిసింది. హీరోహీరోయిన్లపై లవ్లీ సీన్లు తెరకెక్కిస్తున్నారట. పవన్‌కు, శ్రీలీలకు (Sreeleela love scenes) మధ్య ప్రేమ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో అని అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా పూజాహెగ్డే పేరు వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
లీక్ లుక్ హల్‌చల్...
ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎర్రమంజిల్ ఏరియాలో ఓ సెట్ వేశారు. అక్కడ జరిగిన సన్నివేశాల నుంచి ఓ లుక్ లీక్ అయింది. పవన్‌కల్యాణ్ లుంగీ ధరించి సీరియస్‌గా నడుచుకుంటూ వెళ్తున్న ఫొటో ఒకటి లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు.