సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NTR Fans USA : తారక్‌పై అభిమానం.. అమెరికా అభిమానులు ఏం చేశారో చూశారా?

ABN, First Publish Date - 2023-03-21T15:21:28+05:30

ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో కొమురం భీమ్‌ పాత్రతో మెప్పించిన తారక్‌ అంతర్జాతీయ స్థాయిలో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. దాంతో ఆయన పేరు మార్మోగిపోతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలో కొమురం భీమ్‌ (Komuram bheem) పాత్రతో మెప్పించిన తారక్‌ (NTR)అంతర్జాతీయ స్థాయిలో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. దాంతో ఆయన పేరు మార్మోగిపోతుంది. ఆస్కార్‌ వేడుకల కోసం అమెరికా వెళ్లిన తారక్‌ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ అమెరికాలోని పలు ప్రాంతాల్లో అభిమానులను కలిసి కాసేపు ముచ్చటించారు. తాజాగా అమెరికాలోని తారక్‌ అభిమానులు వినూత్న రీతిలో తారక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (USA NTR fans thanks in unique way)

‘కొరటాల శివ (Koratala siva) దర్శకత్వంలో ఎన్టీఆర్‌ (NTR30) నటిస్తోన్న సినిమా కోసం ఎదరుచూస్తున్నాం అని చెబుతూ ఒక బ్యానర్‌ను విమానం సహాయంతో ఆకాశంలో చక్కర్లు కొట్టించారు. ‘‘థ్యాంక్యూ ఎన్టీఆర్‌. మీ 30వ సినిమా కోసం వేచి చూస్తున్నాం’’ అని రాసిన బ్యానర్‌ను ఎగరవేసి ఆకాశమంత అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ‘ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ యూఎస్‌ఏ’ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఎన్టీఆర్‌ 30 బృందానికి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది.ఈ నెల 23 నుంచి షూటింగ్‌ ప్రారంభించనున్నారు.

Updated Date - 2023-03-21T15:21:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!