Ram Charan - Upasana: తల్లి బిడ్డ క్షేమం.. డిశ్చార్జ్ ఫిక్స్!
ABN, First Publish Date - 2023-06-23T10:44:59+05:30
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నెల 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అపోలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మెగా ప్రిన్సెస్‌తో ఉపాసన శుక్రవారం డిశ్చార్జి కానున్నారని తెలిసింది.
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan)- ఉపాసన (Upasana)దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నెల 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అపోలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మెగా ప్రిన్సెస్‌తో ఉపాసన శుక్రవారం డిశ్చార్జి (Upasana Discharge) కానున్నారని తెలిసింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండడంతో వైద్యులు డిశ్చార్జ్ చేయాలని సూచించారు. ఈ నేపఽథ్యంలో శుక్రవారం మధ్యాహ్నాం 1.30 నిమిషాలకు అపోలో ప్రాంగణంలో ఉన్న నాగమ్మ దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడి ఉపాసన దంపతులు ఇంటికి చేరుకోనున్నారు. మనవరాలి రాకతో చిరంజీవి (Chiranjeevi) ఆనందంలో మునిగితేలుతున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందని చిరు ఇటీవల మీడియాతో చెప్పారు. జాతక రీత్యా అంతా బావుందని చిరు చెప్పారు. (Upasana Pressmeet)
అంతేకాదు పలువురు పండితులు, సిద్ధాంతులు ఇప్పటికే రామ్‌చరణ్ కూతురు అదృష్ట జాతకురాలని జోస్యం చెబుతున్నారు. 2012 జూన్‌లో రామ్‌చరణ్. ఉపాసనలు వివాహం చేసుకున్నారు. 11 ఏళ్ల తర్వాత వీరిద్దరికి పాప పుట్టింది. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చిత్రం చేస్తున్నారు. ఉపాసన డెలివరీ టైమ్ తెలిసినప్పటి నుంచి షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చి భార్య చెంతే ఉంటున్నారు.