సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Upasana Viral Post: క్లీంకార కొణిదెల పుట్టిన గదిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ABN, First Publish Date - 2023-07-14T15:34:42+05:30

రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల చిరంజీవి (Chiranjeevi) ఇంట బారసాలు నిర్వహించి, మెగా ప్రిన్సెస్‌కు క్లీంకార అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే! తాజాగా ఉపాసన ఆసక్తికర పోస్ట్‌ చేశారు. తనకు పుట్టబోయే బిడ్డకోసం ముందుగానే గదిని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామ్‌చరణ్‌-ఉపాసన (Ram charan-Upasana) దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల చిరంజీవి (Chiranjeevi) ఇంట బారసాలు నిర్వహించి, మెగా ప్రిన్సెస్‌కు క్లీంకార అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే! తాజాగా ఉపాసన ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ఆమె జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చారు. అయితే తనకు పుట్టబోయే బిడ్డకోసం ముందుగానే గదిని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. గది వాతావరణం ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్‌ కలిగేలా గోడలను అందంగా తీర్చిదిద్దారు.


దీని కోసం ప్రత్యేక డిజైనర్లు పనిచేశారు(klinkara universe). ప్రసవం కోసం ఉన్నది ఆస్పత్రిలోనే అయినా ఇంట్లో ఉన్నట్లు ఫీలయ్యేలా ఉపాసన గదిని తీర్చిదిద్దారు. పుట్టిన బేబీ చూడగానే బొమ్మలు, పక్షులు, చెట్లు కనిపించేలా కర్టన్స్‌ డిజైన్‌ చేయించారు. అడవిని తలపించేలా ఆ గదిని సిద్ధం చేశారు. వాటిని తన బిడ్డకు గదిలో కనిపించేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ’అమ్రాబాద్‌ ఫారెస్ట్‌, వేద వైద్యం ద్వారా ప్రేరణ పొందిన ఈ సుందరమైన ప్రదేశాలలో నేను నా బిడ్డకు జన్మనివ్వడం. నా క్లీంకారను పెంచడం ఎంత ఆనందించానో మీకు చెప్పలేను. పవిత్రా రాజారామ్‌కు కృతజ్ఞతలు’ అని ఉపాసన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోస్ట్‌ వైరల్‌ అవుతోంది. (Upasana Post)

Updated Date - 2023-07-14T15:34:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!