Upasana konidela : మూడో నెలను గుర్తు చేసుకుంటూ..
ABN, First Publish Date - 2023-05-29T14:53:05+05:30
టాలీవుడ్ స్టార్ కపుల్ అనగానే గుర్తొచ్చే ఓ జంట రామ్ చరణ్-ఉపాసన. ఇద్దరూ వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా.. అభిమానులతో టచ్‌లో ఉంటారు. సరదాగా టూర్లు వేస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
టాలీవుడ్ స్టార్ కపుల్ అనగానే గుర్తొచ్చే ఓ జంట రామ్ చరణ్ -ఉపాసన (Ram charan-Upasana). ఇద్దరూ వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా.. అభిమానులతో టచ్‌లో ఉంటారు. సరదాగా టూర్లు వేస్తుంటారు. సోషల్ మీడియా (Social media Viral) వేదికగా అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. మరి కొద్ది రోజుల్లో చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా ఉపాసన (Upasana)సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. గర్భవతిగా మూడో నెలను గుర్తు చేసుకుంది. ఆ సమయంలో మనీష్ మల్హోత్ర తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘నాకే ఆశ్చర్యంగా ఉంది.. (Upasana wonders)నా గ్యాలరీలో ఉన్న ఇంత మంచి ఫొటోలను నేను ఇప్పటి వరకు షేర్ చేయలేదా..!’ అని క్యాప్షన్ పెట్టింది. ఆమె పోస్ట్ చేసిన ఫొటోలకు నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఆ ఫొటోలు చూసి స్పందించారు. ‘ఎంతో అందంగా ఉన్నావు’ అని నమ్రత కామెంట్ పెట్టగా హార్ట్ సింబల్స్‌తో ఉపాసన రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ (Game changer)చిత్రంలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ తాజా షెడ్యూల్ పూర్తి చేసిన చరణ్ ప్రస్తుతం విరామం తీసుకుని గర్భవతిగా ఉన్న ఉపాసనతో వెంటే ఉంటున్నారు