Upasana: అరుదైన ఘనత సాధించిన ఉపాసన
ABN, First Publish Date - 2023-03-24T16:54:59+05:30
అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాస్ సి. రెడ్డి మనవరాలు, రామ్ చరణ్ (Ram Charan) భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన కామినేని (Upasana Kamineni) అరుదైన ఘనత సాధించారు. మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్ అవార్డును గెలుపొందారు.
అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాస్ సి. రెడ్డి మనవరాలు, రామ్ చరణ్ (Ram Charan) భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన కామినేని (Upasana Kamineni) అరుదైన ఘనత సాధించారు. మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్ అవార్డును గెలుపొందారు. పురస్కారాన్ని గెలుపొందడంతో ఉపాసన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆఫ్ ఆసియా-2023 అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు’’ అని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతోనే మెగా కుటుంబం సంబరాలు చేసుకుంది. ఆ సంబరాలను మరవకముందే ఉపాసనకు పురస్కారం రావడంతో ఆ కుటుంబం సంతోషంతో ఉబ్బితబ్బిబయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉపాసన సామజిక కార్యక్రమాలలోను చురుకుగా పాల్గొంటుంటారు. అపోలో ఛారిటీకి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 'బీ పాజిటివ్' హెల్త్ మ్యాగజైన్‌ను నిర్వర్తిస్తున్నారు. 'యు ఎక్స్చేంజ్' అనే సేవా సంస్థను నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలు సేకరించి చిన్నతనంలోనే పేద పిల్లలకు ఇచ్చేవారు. మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడే పిల్లలకు అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించేవారు.
ఉపాసన- రామ్‌చరణ్ చిన్నతనంలో ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరికి పరిచయం ఉండటంతో స్నేహితులుగా తమ బంధాన్ని కొనసాగించేవారు. అనంతరం ఆలోచనలు, అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ జంట 2012 జూన్ 14న పెళ్లి చేసుకున్నారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ఉపాసన దంపతులు కొన్నాళ్ల క్రితమే తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి (Chiranjeevi) స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘ఉపాసన, రామ్‌చరణ్‌లు తల్లిదండ్రులుగా తమ తొలి బిడ్డను ఆహ్వానించబోతున్నారు. ప్రేమతో.. మీ సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని’’ అని చిరు పేర్కొన్నారు.
^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..
SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్
Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..
Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా
Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!