Ram Charan -Upasana: మెగా మెంబర్ వచ్చేది అప్పుడే!
ABN, First Publish Date - 2023-06-19T13:57:14+05:30
రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. వచ్చే నెల మొదటివారంలో ఉపాసన డెలివరీ డేట్ అని కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మరోవార్త నెట్టింట వైరల్ అవుతోంది.
రామ్‌చరణ్ (Ram CHaran)- ఉపాసన (Upasana) దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. వచ్చే నెల మొదటివారంలో ఉపాసన డెలివరీ డేట్ అని కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మరోవార్త నెట్టింట వైరల్ అవుతోంది. మంగళవారం అంటే జూన్ 20వ తేదిన ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో అభిమానులు మెగాస్టార్ ఇంట్లోకి కొత్త మెంబర్ రాబోయేది రేపే అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మెగా కుటుంబం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. (Upasana Delivery Date)
కొద్దిరోజులుగా రామ్‌చరణ్ అయితే ఉపసాన వెంటే ఉంటున్నారు. షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి ఉప్సీతోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఆగస్ట్ వరకూ చెర్రీ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం చరణ్, ఉపాస చిరంజీవి ఇంట్లోకి వచ్చేశారు. చాలాకాలంగా వేరు ఇంట్లో ఉంటున్న ఈ జంట ప్రసవం సమయంలో పెద్దల సమక్షంలో ఉంటే మంచిదని భావించి చిరు ఇంటికి చేరుతున్నట్లు ఇటీవల ఉపాసన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. (Mega Family)