Upasana konidela: ప్రెగ్నెన్సీ .. దుస్తులు... ఉపాసన ఏమన్నారంటే
ABN, First Publish Date - 2023-04-17T13:59:40+05:30
పెళ్లైన తర్వాత తనను ఎంతోమంది కామెంట్లు చేశారని, అందం గురించి విమర్శించే వారనీ, చీటికి మాటికీ బాడీ షేమింగ్ చేసేవారని ఇటీవల రామ్‌చరణ్ భార్య ఆవేదక వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
పెళ్లైన తర్వాత తనను ఎంతోమంది కామెంట్లు చేశారని, అందం గురించి విమర్శించే వారనీ, చీటికి మాటికీ బాడీ షేమింగ్(body Shaming) చేసేవారని ఇటీవల రామ్‌చరణ్ భార్య ఆవేదక వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రామ్‌చరన్- ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. మెగా కుటుంబానికి వారసుడు రాబాబోతున్నాను.ఇటీవల చెర్రీ- ఉపాసన (Ram charan-Upasanతమ మొదటి బిడ్డకు మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పనున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఉపాసనకు డెలివరీ సమయం దగ్గరపడుతోంది. అయినా తన యాక్టివిటీస్, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు ప్రొఫెషనల్ లైఫ్, ఒత్తిడికి దూరంగా ఉంటారు. ప్రయాణాలు పెద్దగా చేయరు. కానీ తన కెరీర్‌కు ఇలాంటివేమీ అడ్డు కావని ఉపాసన అంటున్నారు. ప్రెగ్నెన్సీ కోసం ప్రత్యేకంగా ఎలాంటి దుస్తులు ధరించడంలో లేదని చెప్పారు ఉపాసన. ఇటీవల దుబాయ్ వెళ్లిన జంట అక్కడే సన్నిహితుల సమక్షంలో సీమంతం జరుపుకొన్నారు. తాజాగా వెకేషషన్ పూర్తి చేసుకున్న ఈ జంట తాజాగా హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన తన వ్యక్తిగత విషయాలు, ప్రెగెన్సీ తదితర విషయాల గురించి మాట్లాడారు.
ఉపాసన మాట్లాడుతూ(Upasana konidela).. ‘ప్రెగ్నెన్సీ ఓ వేడుకలా ఉండాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం ఈ జర్నీని నేను ఎంతో ఆస్వాదిస్తున్నా. అందుకే ప్రపంచ దేశాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చుట్టేసి వచ్చా. నా ఆహారం, పోషకాహారం గురించి డాక్టర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తున్న. అంతే కాదు గర్భం దాల్చడం వల్ల ప్రత్యేకమైన దుస్తు ధరించడం లేదు. మామూలు దుస్తుల్లోనే నేను ఫిట్‌గా ఉన్నా. అందుకే ప్రత్యేకంగా మెటర్నిటీ క్లాత్స్ ధరించడం లేదు. నార్మల్ దుస్తుల్లో కనిపించడాన్ని గొప్పగా భావిస్తున్నా. ఇదొక గొప్ప ప్రయాణం’’ అని ఉపాసన చెప్పుకొచ్చారు.