Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ఆ రెండు చిత్రాలే ప్రేరణ!
ABN, First Publish Date - 2023-02-18T01:28:23+05:30
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)సినిమా తీయడానికి రెండు సినిమాలు స్ఫూర్తి అని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS rajamouli)అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో భారతీయ సినిమా పేరును అంతర్జాతీయ వేదికలపై మార్మోగేలా చేశారు జక్కన్న.
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)సినిమా తీయడానికి రెండు సినిమాలు స్ఫూర్తి అని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS rajamouli)అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో భారతీయ సినిమా పేరును అంతర్జాతీయ వేదికలపై మార్మోగేలా చేశారు జక్కన్న. అయితే ఈ సినిమా తీయడానికి ప్రేరణ తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన అలనాటి చిత్రం ‘మాయాబజార్’(mayaabazar) లోని కొన్ని సన్నివేశాలు ప్రేరేపించాయని చెప్పారు. మెల్ గిబ్సన్ తీసిన సినిమాలోని సన్నివేశాలు ‘కొమురం భీం’ (komuram bhim Song) పాటకు ఎంతో ప్రేరణ అని ఆయన అన్నారు.
దీని గురించి రాజమౌళి మాట్లాడుతూ ‘‘గతంలో పురాణాలు ఆధారంగా ఎన్నో చిత్రాలొచ్చాయి. వాటిలో ఉపయోగించిన భాష ఇప్పటి భాషకు దగ్గరగా లేదు. అందులో వాడిన భాష పదాలు షేక్‌స్పియర్ భాషను పోలి ఉంటాయి. కానీ, మాయాబజార్‌లో మాటలు కొత్త భాషకు దగ్గరగా ఉంటాయి. అలా చేయడానికి దర్శకుడికి చాలా ధైర్యం కావాలి. నేను ఆయన సాహసాన్ని చూసి ఆశ్చర్యపోయాను. అప్పట్లో తెలుగు పరిశ్రమలో ఉన్న చాలా మంది స్టార్స్ ‘మాయాబజార్’ సినిమాలో ఉన్నారు. అలాంటి స్టార్స్‌తో చేసిన ప్రయోగమే ‘మాయాబజార్’. ఆ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ప్రేరణనిచ్చింది. అలాగే ‘ఫ్యాషన్ ఆఫ్ ది క్రేౖస్ట్’ సినిమా మొత్తాన్ని నేను ఒకేసారి చూడలేకపోయాను. ఆ సినిమా నాకు చాలా హింసాత్మకంగా అనిపించింది. అందులోని కొన్ని సన్నివేశాలు బాగా అనిపించాయి. ‘కొమురం భీం’ పాటలో కొరడాతో కొట్టే సన్నివేశానికి ఆ సినిమానే స్పూర్తి’’ అని రాజమౌళి చెప్పారు.