సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Fight Masters Ram Lakshman: జోలె పట్టి బిక్షాటనం చేసిన ఫైట్ మాస్టర్స్, ఎందుకంటే...

ABN, First Publish Date - 2023-06-12T13:02:36+05:30

అగ్ర యాక్షన్ కోరియోగ్రాఫర్స్ అయిన రామ్ లక్ష్మణ్ అన్నదమ్ములు చీరాల పట్టణంలో జోలె పట్టి షాపులకి తిరిగి, వీధుల్లో బిక్షాటన చేసారు. చూసిన ప్రజలు షాక్ అయ్యారు, కానీ వాళ్ళు చేసింది ఒక మంచి పని కోసం అని తెలిసి అందరూ ముందుకు వచ్చారు.

Action choreographers Ram Lakshman
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ #RamLakshman అంటే తెలుగు సినిమా పరిశ్రమలో, ప్రేక్షకుల్లో తెలియాని వారుండరు. వాళ్లిద్దరూ కవలలు, అలాగే ఇద్దరూ మంచి సహృదయం వున్నవారు. దక్షిణ భారతదేశంలో వీరు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గా అగ్రస్థానంలో వున్నారు. చాలామంది అగ్ర నటులతో, అలాగే చాలా సినిమాల్లో వీరిద్దరూ కలిసి పనిచేశారు, చేస్తున్నారు కూడా. అటువంటి వీరిద్దరూ ఆంధ్ర ప్రదేశ్ లోని చీరాల (Chirala) పట్టణంలో రోడ్ల మీద జోలె పట్టుకొని ప్రతీ ఇంటికి, షాపు కి వెళ్లి బిక్షాటన చేశారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ పరిశ్రమలో అగ్ర స్థానంలో వుండి, పారితోషికం కూడా బాగా తీసుకుంటూ సెటిల్ అయిపోయారు. మరి వీరెందుకు జోలే పట్టాల్సి వచ్చింది అంటే, వీళ్లిద్దరికీ సామజిక సేవ అంటే ఎంతో ఇష్టం. ఇప్పటి నుండీ కాదు, ఎప్పటి నుండో. సినిమాల్లో భారీ పోరాట సన్నివేశాలు ఇద్దరూ చేయిస్తున్నారు, నిజ జీవితం లో ఇద్దరు అన్నదమ్ములు ఎంతో ఆత్మీయంగా వుంటారు. ఆధ్యాత్మికత కూడా ఎక్కువే ఇద్దరికీ. అలాంటి వీరిద్దరూ వీధుల్లో ఇలా ఒక సంచితో కనపడేసరికి ప్రజలు షాక్ అయ్యారు.

ఇలా ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో వాళ్లేమని చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు. చీరాల పట్టణంలో ఈ ఇద్దరూ ఒక వృద్ధాశ్రమం కోసం ఈ జోలె పెట్టినట్టుగా చెప్పారు. కోటయ్య వృద్ధాశ్రమం అని చీరాల లో వుంది, కోటయ్య పోయాక, అతని భార్య, ఇద్దరు కొడుకులు ఆ ఆశ్రమాన్ని నడుపుతున్నారని, అయితే చిన్న చిన్న ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నా వాళ్ళు ఆ వృద్ధాశ్రమాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు రామ్ లక్ష్మణ్ సోదరులు. ఆ ఆశ్రమానికి ఒక ఆటో అవసరం వచ్చిందని అందుకోసం ఆర్థికంగా సహాయం కోసం, ఈ అన్నదమ్ములు ఇద్దరూ జోలె పట్టారని చెప్పారు. ఇది ఒక సామజిక ధర్మంగా చెప్పారు. ప్రతి మనిషిలోని ఎదుటువాడికి సహాయం చెయ్యాలన్న గుణం కలగాలని చెప్పడానికే ఇలా చేశామని చెప్పారు. తాము వ్యక్తిగతంగా కూడా ఆ ఆశ్రమానికి ఆర్ధిక సహాయం చేశామని, కానీ తోటి మనిషికి సహాయం పడాలన్న ఆలోచన ప్రతి మనిషికి రావాలని అందుకోసమని ఇలా సమాజంలో ఉన్నవాళ్ళకి చెప్పాలని తాము చేశామని చెప్పారు అన్నదమ్ములు.

Updated Date - 2023-06-12T13:02:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!