సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kartik Aaryan: టాలీవుడ్ డైరెక్టర్‌తో సినిమా.. జోనరేంటో తెలుసా..?

ABN, First Publish Date - 2023-04-03T18:04:10+05:30

‘బాహుబలి’ అనంతరం సినీ ఇండస్ట్రీల మధ్య హద్దులు చెరిగిపోయాయి. తెలుగులోని డైరెక్టర్స్‌తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘బాహుబలి’ అనంతరం సినీ ఇండస్ట్రీల మధ్య హద్దులు చెరిగిపోయాయి. తెలుగులోని డైరెక్టర్స్‌తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ చందు మొండేటి (Chandoo Mondeti), బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan)తో సినిమా చేయనున్నారు. ఆయనకు కథను కూడా వినిపించారు. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో సినిమా రూపొందనుంది. బడా ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన గీతాఆర్ట్స్ నుంచి త్వరలోనే రానుంది.

కార్తిక్ ఆర్యన్‌కు కథను వినిపించానని చందు మొండేటి చెప్పారు. సినిమా గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు. ‘‘కార్తిక్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్‌ అందుబాటులో లేవు. మా చిత్రానికి డేట్స్ కేటాయించడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం ఇద్దరం చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే మా కాంబినేషన్‌లో ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ఆ మూవీ సైన్స్ ఫిక్షన్ అని కచ్చితంగా చెప్పలేను. థ్రిల్లర్ జోనర్‌లో కథ కొనసాగనుంది. నేను చెప్పిన కథలోని పాత్రకు కార్తిక్ సరిగ్గా సరిపోతారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా పలు భాషల్లో తెరకెక్కనుంది. నేను దర్శకత్వం వహించిన ‘కార్తికేయ 2’ కు ఆయన ఫిదా అయ్యారు. ప్రస్తుతం చెప్పిన స్టోరీ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఎదురు చూస్తున్నారు. సినిమా టైటిల్‌ను ఇప్పుడే చెప్పలేను. గీతాఆర్ట్స్ అధికారికంగా దానిని ప్రకటిస్తుంది’’ అని చందు తెలిపారు.

కార్తిక్ ఆర్యన్ చివరగా ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) రీమేక్ షెహజాదాలో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభించలేదు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. కార్తిక్ ప్రస్తుతం ‘సత్య ప్రేమ్ కీ కహానీ’ లో నటిస్తున్నారు. చందు మొండేటి చివరగా ‘కార్తికేయ 2’ ను తెరకెక్కించారు. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Nani-Balakrishna: నానికి 35.. బాలకృష్ణకు 36

Janhvi Kapoor: స్టేజ్‌పై డ్యాన్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Updated Date - 2023-04-03T18:11:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!