సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chiranjeevi: మాతృభాష కన్నడ.. అయినా చెరగని ముద్ర

ABN, First Publish Date - 2023-01-27T10:41:11+05:30

సినీయర్ నటి జమున (Jamuna) నేడు (శుక్రవారం) కన్నుమూశారు.

Chiranjeevi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీయర్ నటి జమున (Jamuna) నేడు (శుక్రవారం) కన్నుమూశారు. దీంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఎంతోమంది టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను.

- చిరంజీవి


అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్థ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున గారు... నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు.. ఈ రోజున జమున గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి... వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

- నందమూరి బాలకృష్ణ

మహానటి జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్థన. జమున గారి కుటుంబసభ్యులు మరియు వారి సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి.

- నందమూరి కల్యాణ్‌రామ్

Updated Date - 2023-01-27T10:48:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!