Breaking News: టాలీవుడ్‌లో మరో విషాదం.. కె.విశ్వనాథ్ ఆస్థాన ఎడిటర్ కన్నుమూత
ABN, First Publish Date - 2023-02-21T10:52:44+05:30
ఈ ఏడాది టాలీవుడ్ (Tollywood)కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా పరిశ్రమకి చెందిన ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు.
ఈ ఏడాది టాలీవుడ్ (Tollywood)కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా పరిశ్రమకి చెందిన ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. ఈ నెల (ఫిబ్రవరి 2న) ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ (K. Viswanath) మరణించగా.. రెండు రోజుల క్రితం నందమూరి తారకరత్న మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా కె. విశ్వనాథ్, దాసరి నారాయణరావు, శంకరాభరణం చిత్రాలకి ఎడిటర్‌గా వ్యవహరించిన జీజీ కృష్ణారావు (GG Krishnarao) మృతి చెందారు.
శంకరాభరణం, వేటగాడు, బొబ్బిలి పులి, సర్ధార్ పాపారాయుడు వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు ఎడిటర్‌గా వ్యవహరించిన ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు (87) మంగళవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తన కెరీర్‌లో రెండు వందల సినిమాలకు పైగా ఆయన ఎడిటర్‌గా పని చేశారు. అలాగే బాపు, జంధ్యాలతో పాటు దర్శకరత్న దాసరి నారాయణ రావు, కళా తపస్వి కె. విశ్వనాథ్ వంటి ప్రముఖ దర్శకుల సినిమాలకు ఎడిటర్‌గా పని చేశారు. విజయ మాధవి ప్రొడక్షన్స్, పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థల నిర్మించిన ప్రతి సినిమాకి ఆయనే ఎడిటర్‌గా వ్యవహరించేవారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సాగర సంగమం’, ‘శుభలేఖ’, ‘శుభ సంకల్పం’, ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’, ‘సిరివెన్నెల’, చిత్రాలకు కృష్ణరావే ఎడిటర్‌గా పని చేశారు. కె.విశ్వనాథ్ ఆస్థాన ఎడిటర్‌గా మారిపోయారు. ఎంతోమంది ఎడిటర్లకి మార్గదర్శిగా నిలిచిన ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇది కూడా చదవండి: #RIPMayilSamy: సినీ పరిశ్రమలో విషాదం.. తమిళ ‘సీన్ స్టీలర్’ కన్నుమూత