Thurum Khanlu: ‘తురుమ్ ఖాన్‌లు’కు సీనియర్ దర్శకుడి సపోర్ట్
ABN, First Publish Date - 2023-05-06T19:56:55+05:30
‘తురుమ్ ఖాన్‌లు’ చిత్రానికి సంబంధించి టైటిల్‌తో పాటు ఈ మోషన్ పోస్టర్ కూడా చాలా బావుంది. ఒక వెరైటీ సినిమా అనిపిస్తుంది. ప్రేక్షకులను మెప్పించే కంటెంట్‌తోనే
‘తురుమ్ ఖాన్‌లు’ చిత్రానికి సీనియర్ దర్శకుడు వి. సముద్ర (V Samudra) సపోర్ట్ అందించారు. స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఎన్. శివ కళ్యాణ్ (N Siva Kalyan) దర్శకత్వంలో ఎమ్‌డి అసీఫ్ జాని నిర్మిస్తోన్న చిత్రం ‘తురుమ్ ఖాన్‌లు’ (Thurum Khanlu). శ్రీరామ్ నిమ్మల, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, సీతా పులి, ఐశ్వర్య ఉల్లింగల, శ్రియాంక, విజయ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ఆవిష్కరణ (Motion Poster Launch) కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ దర్శకుడు వి.సముద్ర మోషన్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వి.సముద్ర మాట్లాడుతూ.. ‘తురుమ్ ఖాన్‌లు’ చిత్రానికి సంబంధించి టైటిల్‌తో పాటు ఈ మోషన్ పోస్టర్ కూడా చాలా బావుంది. ఒక వెరైటీ సినిమా అనిపిస్తుంది. ప్రేక్షకులను మెప్పించే కంటెంట్‌తోనే యూనిట్ వస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఈ సినిమాతో పరిచయం అవుతోన్న దర్శకనిర్మాతలతో పాటు నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. (Thurum Khanlu Motion Poster Launch)
నిర్మాత మాట్లాడుతూ.. మా చిత్ర మోషన్ పోస్టర్ లాంచ్ చేసి.. సపోర్ట్ అందించిన సముద్రగారికి ధన్యవాదాలు. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. దర్శకుడు ఒక మంచి కథతో సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించారు. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. జూన్‌లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలుపగా.. దర్శకుడు ఎన్.శివ కళ్యాణ్ మాట్లాడుతూ.. పల్లెటూరి నేపథ్యంలో సాగే రివేంజ్ కామెడీ డ్రామా చిత్రమిది. సినిమా చాలా అల్లరల్లరిగా ఉంటూ అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంది. దర్శకుడిగా నాకిది తొలి చిత్రం. మా నిర్మాత క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. సినిమా అంతా మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో పిక్చరైజ్ చేశాం. త్వరలోనే పాటలు విడుదల చేస్తామని అన్నారు. (Thurum Khanlu Telugu Movie)
ఇవి కూడా చదవండి:
************************************************
*Megastar VS Superstar: చిరంజీవికి పోటీగా రజనీకాంత్.. ఆగస్ట్‌లో అసలు మజా!
*Ramabanam Film Review: అన్నదమ్ముల కథన్నారు, కానీ తీరా చూసాక...
*Bhumika Chawla: హీరోల వయసుపై భూమిక కామెంట్స్.. ఏం మారలేదు
*Takkar: చాలా రోజుల తర్వాత.. ఓన్లీ హీరోయిన్‌పైనే సాంగ్
*The Kerala Story: అది కాదు.. ఇది కదా అసలు స్టోరీ.. ఏఆర్ రెహమాన్ కూడా దండం పెట్టేశారు
*Ugram Twitter Review: సినిమా బాగుందంటున్నారు కానీ..
*Rama Banam Twitter Review: ఆ లిస్ట్‌లోకి ఇంకో సినిమా చేరినట్టే..