Theatre - OTT: ఈ వారం సందడి చేసే చిత్రాలివే!
ABN, First Publish Date - 2023-04-24T11:51:37+05:30
సమ్మర్ సీజన్ మొదలైంది. ఈ సీజన్ సినిమాల సందడీ మొదలైంది. వేసవిలో ధియేటర్‌లలో సందడి చేయడానికి, వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు సిద్ధమయ్యాయి.
సమ్మర్ సీజన్ మొదలైంది. ఈ సీజన్ సినిమాల సందడీ మొదలైంది. వేసవిలో ధియేటర్‌లలో (Theatre releases) సందడి చేయడానికి, వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. కొన్ని ఓటీటీ (OTT) చిత్రాలు, వెబ్ సిరీస్‌లతోపాటు ఇప్పటికే థియేటర్‌లో విడుదలై విజయం సాధించిన చిత్రాలు, ఓటీటీ మాధ్యమాల్లో సందడి చేయనున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
లవర్ బాయ్ టు యాక్షన్... (Agent)
అఖిల్ అక్కినేని ఇప్పటి వరకూ లవర్‌బాయ్‌గానే చూశాం. ఏజెంట్‌తో పూర్తి యాక్షన్ హీరోగా చూడబోతున్నాం. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్ కథానాయకుడిగా రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటించింది. మమ్ముటీ ఓ కీలక పాత్ర పోషించారు. పోస్టర్లు, ట్రైలర్ చూస్తే ఇందులో అఖిల్‌ను కొత్తగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రీ రిలీజ్ వేడునను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 28న థియేటర్‌లలో విడుదల కానుందీ సినిమా.
మిగిలిన ప్రశ్నలకు సమాధానం.. పి.ఎస్-2 (Ponnien selvan -2)
మణిరత్నం దర్శకత్వంలో గత ఏడాది విడుదలై విజయం సాధించిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘పొన్నియన్ సెల్వన్-2’ కూడా రాబోతుంది. మొదటి భాగంలో మిగిలిన ప్రశ్నలకు సమాధానం ఈ చిత్రంతో చెప్పబోతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య కరికాలన్, నందిని మధ్య ఏం జరిగింది? పెద పలవేట్టురాయర్, చిన పలవేట్టురాయర్ కుట్రలను తెలివితేటలతో కుందవై ఎలా భగ్నం చేసింది? ఇందుకు వందియదేవన్ చేసిన సహాయం ఎలాంటిది? ఇలా ఎన్నో ప్రశ్నలకు ‘పొన్నియన్ సెల్వన్-2లో సమాధానం దొరకనుందని దర్శకుడు మణిరత్నం వెల్లడించారు. లైకా సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాయి.
తెరపై ఒకే ఒక్క పాత్రతో... (Rara Penimiti)
నందిత శ్వేతా కథానాయికగా రూపొందిన చిత్రం ‘రా రా పెనిమిటి’. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వంలో ప్రమీల నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 28న విడుదల కానుంది. తెరపై ఒక పాత్ర కనిపించడం ఈ సినిమా ప్రత్యేకత. అయితే తెరపై కనిపించేది ఒక్క పాత్రే అయినా... వినిపించే పాత్రలకు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మ వాయిస్ అందించారు. ‘కొత్తగా పెళ్లైన అమ్మాయి తన భర్త రాకకోసం ఎదురు చూస్తూ పడే విరహ వేదనే ఈ సినిమా ఇతివృత్తం. ఆమె ‘భర్త వచ్చాడా లేదా అన్నదే సస్పెన్స్’ అని దర్శకుడు చెప్పారు.
ఓటీటీతో సందడి చేసే చిత్రాలు/ సిరీస్‌లు
బ్లాక్‌బస్టర్ ‘దసరా’(Dasara)
నాని, కీర్తి సురేశ్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్ యాక్షన్ పీరియాడికల్ డ్రామా ‘దసరా’. దీక్షిత్‌శెట్టి, షైన్ టామ్ చాకో కీలక పాత్రధారులు. గత నెల మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి నానికి కెరీర్‌కి ప్రత్యేక చిత్రంగా నిలిచింది. ఈ నెల 27వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ర్టీమింగ్ కానుంది.
తెలుగులో అమెరికన్ థ్రిల్లర్... (Citadel )
భాషతో సంబంధం లేకుండా వెబ్‌సిరీస్‌లు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. కాస్త ఆలస్యం అయినా ప్రాంతీయ భాషల్లోకి డబ్బింగ్ చేసి ఈ వెబ్‌సిరీస్‌లను ఓటీటీ వేదికగా అందిస్తున్నారు. తాజాగా ప్రేక్షకులను అలరించబోతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘సిటాడెల్’. రిచర్డ్ మ్యాడన్, ప్రియాంక చోప్రా, జోన్స్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 28న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం తొలి రెండు ఎపిసోడ్‌లను తీసుకురానున్నారు. మే నెల నుంచి పతి వారం ఒక్కో ఎపిసోడ్ విడుదల చేయనున్నారు. రూసో బ్రదర్స్, అమెజాన్ స్టూడియోస్ 300 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. డేవిడ్ వెయిల్ దర్శకత్వం వహించారు. ఇదే చిత్రం హిందీ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్నారు.
జీ5 లో ‘వ్యవస్థ’
న్యాయ వ్యవస్థ నేపథ్యంలో రూపొందిన ‘వ్యవస్థ’ అనే వెబ్ సిరీస్‌ను జీ5 ఓటీటీ అందించనుంది. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన సిరీస్ ఏప్రిల్ 28 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘నారప్ప’ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన కార్తిక్ రత్నం, హెబ్బా పటేల్, సంపత్‌రాజ్ తదితరులు ఇందులో కీలక పాత్రధారులు.
నెట్‌ఫ్లిక్స్
ఏప్రిల్ 26: కోర్ట్ లేడీ (హిందీ వెబ్‌సిరీస్)
నోవోల్యాండ్(వెబ్‌సిరీస్)
ఏప్రిల్ 27: ది గుడ్ బ్యాడ్ మదర్
ఏప్రిల్ 28: ఎకా (హాలీవుడ్)
బిఫోర్ లైఫ్ ఆఫ్టర్‌డెత్ (హాలీవుడ్)
డిస్నీ+హాట్‌స్టార్
ఏప్రిల్ 27: సేవ్ ది టైగర్స్ (తెలుగు సిరీస్)
ఏప్రిల్ 28: పీటర్ పాన్ అండ్ వెండీ.
అమెజాన్ ప్రైమ్
ఏప్రిల్ 27: పత్తు తల (తమిళం)
జీ5
ఏప్రిల్ 28: యూటర్న్ (హిందీ)
సోనీలివ్
ఏప్రిల్ 28: తురముఖమ్ (మలయాళ చిత్రం)
బుక్ మై షో
ఏప్రిల్ 26: స్ర్కీమ్ VI