Upcoming movies : సెప్టెంబర్ చివరివారం సందడి ఈ చిత్రాలదే..!
ABN, First Publish Date - 2023-09-25T11:26:12+05:30
సెప్టెంబర్ నెల చివరికి చేరుకుంది. థియేటర్, ఓటీటీలో సందడి చేయడానికి సినిమాలు సిరీస్‌లు వరుసకట్టాయి. ‘ప్రభాస్’ నటించిన ‘సలార్’ వాయిదా పడడంతో చిన్న పెద్ద చిత్రాలు క్యూ కట్టేశాయి. అవేంటో చూద్దాం.
సెప్టెంబర్ నెల చివరికి చేరుకుంది. థియేటర్, ఓటీటీలో (Theatre and ott Releases ) సందడి చేయడానికి సినిమాలు సిరీస్‌లు వరుసకట్టాయి. ‘ప్రభాస్’ నటించిన ‘సలార్’ వాయిదా పడడంతో చిన్న పెద్ద చిత్రాలు క్యూ కట్టేశాయి. అవేంటో చూద్దాం. ‘
అఖండ’తో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’. రామ్ పోతినేని కథానాయకుడు. శ్రీలీల, సయీ మంజ్రేకర్ నాయికలు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ ఇంతకుముందు ఎప్పుడూ కనిపించని మాస్ గెటప్‌లో సందడి చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘స్కంద’ విడుదల కానుంది.
రూట్ మార్చిన అడ్డాల...
కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అయిన శ్రీకాంత్ అడ్డాల తన రూట్ మార్చి కొత్త బాట పట్టారు. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ క్లాసిక్స్ తీసిన ఆయన ‘నారప్ప’ చిత్రంతో తనలోని మరో యాంగిల్ చూపించారు. ఇప్పుడు అదే తరహాలో యాక్షన్ థ్రిల్లర్ ‘పెదకాపు - 1’ తెరకెక్కించారు. విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ రవీందర్ రెడ్డి మిర్యాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
18 ఏళ్ల తర్వాత సీక్వెల్...
2005లో రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వం వహించిన ‘చంద్రముఖి’ చిత్రం ఎంతగా విజయం సాధించిన సంగతి తెలిసిందే! దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి-2’ వస్తోంది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారులు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 17 ఏళ్ల క్రితం కోట నుంచి వెళ్లిపోయిన చంద్రముఖి మళ్లీ ఎందుకొచ్చిందనే ఆసక్తికరం అంశంతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది. తొలి భాగంలో జ్యోతిగా టైటిల్ పాత్ర పోషించగా ‘చంద్రముఖి2’లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటించారు.
‘ది కశ్మీర్ ఫైల్స్’ తర్వాత మరో వార్..
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ వివాదాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ సినిమా తర్వాత భారీ బడ్జెట్‌తో పెద్ద నిర్మాణ సంస్థలు ఆఫర్లు ఇచ్చినా ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో వచ్చిన లాభాలతో కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారీకి శాస్త్రవేత్తలు పడ్డ కష్టాన్ని చూపించడానికి వివేక్ ‘ది వ్యాక్సిన్ వార్’ రూపొందించారు. వైద్యులు, పరిశోధకులు చేసిన గొప్పసేవలకు ఈ సినిమా నివాళిగా నిలుస్తుందని చిత్రం బృందం చెబుతోంది. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ వారం ఓటీటీలో స్ర్టీమింగ్ అయ్యే సినిమాలు- సిరీస్‌లు వివరాల..
నెట్‌ఫ్లిక్స్
సెప్టెంబరు 24 - గాండీవధారి అర్జున
సెప్టెంబరు 26 - ద డెవిల్స్ ప్ల్లాన్ (కొరియన్ సిరీస్)
సెప్టెంబరు 28 - ఐస్‌కోల్డ్
సెప్టెంబరు 28 - కాసిల్వేనియా (వెబ్‌సిరీస్)
సెప్టెంబరు 28 - లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ (హాలీవుడ్)
సెప్టెంబరు 29 - చూనా (హిందీ సిరీస్)
అమెజాన్ ప్రైమ్
సెప్టెంబరు 26 - ద ఫేక్ షేక్ (వెబ్‌సిరీస్)
సెప్టెంబరు 27 - హాస్టల్ డేజ్ (హిందీ)
సెప్టెంబరు 28 - కుమారి శ్రీమతి
సెప్టెంబరు 29 - జెన్ వి (వెబ్‌సిరీస్)
డిస్నీ+హాట్‌స్టార్
సెప్టెంబరు 28 - కింగ్ ఆఫ్ కొత్త (మలయాళం)
సెప్టెంబరు 29 - లాంచ్‌పాడ్ (వెబ్‌సిరిస్2)
సెప్టెంబరు 29 - తుమ్ సే నహీ పాయేగా (హిందీ)
ఆహా
సెప్టెంబరు 29 - పాపం పసివాడు
సోనీలివ్
సెప్టెంబరు 29 - ఏజెంట్ (తెలుగు)
సెప్టెంబరు 29 - అదియా (తమిళ్)
బుక్ మై షో
సెప్టెంబరు 29 - బ్లూ బీటిల్ (హాలీవుడ్)
లయన్ గేట్ ప్లే
సెప్టెంబరు 29 - సింపథీ ఫర్ ది డెవిల్(హాలీవుడ్)