సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telugu Film Chamber: ఫిల్మ్‌ చాంబర్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2023-07-21T21:23:00+05:30

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నె? 14న నామినేషన్స్‌ పూర్తి కాగా, 21తో నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోవడానికి సమయం పూర్తయింది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నిర్మాత సి.కల్యాణ్‌, దిల్‌ రాజు ప్యానల్‌ మధ్య పోటీ జరగనుంది. వీళ్లిద్దరే అధ్యక్ష బరిలో ఉన్నట్లు సమాచారం.

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ (FIlm Chamber Elections) ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 14న నామినేషన్స్‌ పూర్తి కాగా, 21తో నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోవడానికి సమయం పూర్తయింది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నిర్మాతలు సి.కల్యాణ్‌ (C Kalyan), దిల్‌ రాజు (Dil raju) ప్యానల్‌ మధ్య పోటీ జరగనుంది. వీళ్లిద్దరే అధ్యక్ష బరిలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలుగు నిర్మాతల సెక్టార్‌, డిస్ర్టిబ్యూటర్‌ సెక్టార్‌, స్టూడియో సెక్టార్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఎగ్జిబిటర్‌ సెక్టార్‌కు ఎన్నిక ఏకగ్రీవమైంది.

నిర్మాత సి.కల్యాణ్‌ ఇప్పటికే టాలీవుడ్‌ నుంచి సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ వరకూ ఎన్నో పదవుల్లో పని చేశారు. మరోవైపు దిల్‌ రాజు.. యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ ఏర్పాటు చేసుకున్న గిల్డ్‌లో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు ప్యానల్స్‌ నువ్వా - నేనా అన్నట్లు తలపడనున్నాయి. గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో ఏ ఎన్నికలు జరిగినా రచ్చరచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే! మరి ఈ ఎలక్షన్లు ఎలా జరగబోతున్నాయో చూడాలి.

Updated Date - 2023-07-21T21:33:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!