సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Film Chamber Elections: హామీల వరద.. గెలుపు ఎవరిది?

ABN, First Publish Date - 2023-07-30T12:59:08+05:30

తెలుగు చలన చిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి (TFCC) ఎన్నికలు ఆదివారం (జులై, 30) ఉదయం ఫిల్మ్‌ ఛాంబర్‌లో (Film Chamber elections) ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నాం 3 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ప్రొడ్యూసర్‌ సెక్టార్‌, డిస్ర్టిబ్యూషన్‌ సెక్టార్‌, స్టూడియో సెక్టార్‌, ఎగ్జిబిటర్‌ సెక్టార్‌ల మధ్య ఎన్నికలు జరగనున్నాయి.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి (TFCC) ఎన్నికలు ఆదివారం (జులై, 30) ఉదయం ఫిల్మ్‌ ఛాంబర్‌లో (Film Chamber elections) ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నాం 3 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ప్రొడ్యూసర్‌ సెక్టార్‌, డిస్ర్టిబ్యూషన్‌ సెక్టార్‌, స్టూడియో సెక్టార్‌, ఎగ్జిబిటర్‌ సెక్టార్‌ల మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఫిల్మ్‌ ఛాంబర్‌ మనుగడ, భవిష్యత్‌ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందిద్దామనే కాంక్షతో దిల్‌ రాజు ప్యానల్‌, చిన్న సినిమాల మనుగడ, డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జీ తగ్గింపు హామీలతో సి.కల్యాణ్‌ ప్యానెల్‌ బరిలో నిలిచాయి. అధ్యక్ష పదవి కోసం సీనియర్‌ నిర్మాత సి.కల్యాణ్‌, దిల్‌ రాజు పోటీపడుతున్నారు. అన్ని సెక్టార్లు కలిపి మొత్తం 2 వేలకు పైగా ఇందులో సభ్యులున్నారు. నిర్మాతల సెక్టార్‌ నుంచి సుమారు 1500 మంది, డిస్ర్టిబ్యూటర్ల నుంచి 500, స్టూడియో? నుంచి 98 మంది సభ్యులుగా ఉన్నారు. ఒక్కొక్కరుగా వచ్చిన ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. నేటి ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌డీసీ చైర్మన్‌, నటుడు పోసాని కృష్ణమురళి, నిర్మాత సుప్రియ, గుణశేఖర్‌ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు మొత్తం 104 ఓట్లు పోలైయ్యాయి. 11.30 నిమిషాల సమయానికి 710 ఓట్లు పోల్‌ అయ్యాయి. ప్రొడ్యూసర్‌ సెక్టర్‌ నుంచి 450, స్టూడియో సెక్టార్‌ నుంచి 50, డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ నుంచి 210 పోలైన ఓట్లు అయ్యాయని తెలిసింది. ఇప్పటికే ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌ నుంచి 16 మంది ఈసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 గంటలకు పోలింగ్‌ పూర్తవుతుంది. వెంటనే లెక్కింపు మొదలుపెట్టి 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. అయితే పరిశ్రమలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ గతంలో కూడా చాలామంది హామీలిచ్చారు. వారంతా ఇచ్చిన హామీలను ఎంతగా నెరవేర్చారో వారికే ఎరుక. మరి తాజాగా బరిలో ఉన్న సి.కల్యాణ్‌, దిల్‌ రాజు ఇచ్చిన మాటలను ఎంతగా నిలబెట్టుకుంటారో చూడాలి. వీరిద్దరిలో గెలుపెవరితో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే!

జీవిత వ్యాఖ్యలు.. (jeevitha Rajasekhar)

ఎలక్షన్ల సందర్భంగా నిర్మాతగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన జీవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేయమని సభ్యులకు సూచించారు. ఇండస్ట్రీలో చాలా సమస్యల్లో ఉంది. సమస్యలకు పరిష్కార మార్గం ఎవరు చూపిస్తారో ఆలోచించి ఎవరీ ేస్టటస్‌ ఎంటి అని తెలుసుకొని వాళ్లకు ఓటు వేయండి. కరోనా సమయంలో పరిశ్రమ ఎన్నో కష్టాలు చూసింది. నేను ఇండస్ర్టీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ మార్పు కనిపించలేదు. సెన్సార్‌లో చాలా ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి. సెన్సార్‌లోనే ఎడ్యుకేట్‌ చేయాల్సి ఉంది. నేను దిల్‌ రాజు ప్యానల్‌కి సపోర్ట్‌ చేస్తున్నా’’ అని అన్నారు.

Updated Date - 2023-07-30T13:15:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!