Jimmy Kimmel: ఆస్కార్ హోస్ట్‌పై తెలుగు అభిమానుల ఆగ్రహం.. కారణం ఏంటంటే..?
ABN, First Publish Date - 2023-03-13T18:40:57+05:30
మార్చి 13.. బారతీయ సినిమా చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజిది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకుంది.
మార్చి 13.. బారతీయ సినిమా చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజిది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకుంది. తెలుగు సినిమా ‘ఆర్‌ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ అవార్డును కైవసం చేసుకుంది. అకాడమీ పురస్కారాలను గెలుపొందడంతో రెండు టీమ్‌లు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు మహోత్సవంలో ఓ అంశం మాత్రం వివాదాన్ని రేకెత్తించింది. తెలుగు అభిమానులు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
ఆస్కార్ అవార్డ్స్‌కు జిమ్మి కిమ్మెల్ (Jimmy Kimmel) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తన స్పీచ్‌లో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ను బాలీవుడ్ చిత్రంగా వ్యాఖ్యానించారు. దీంతో అభిమానులు.. తెలుగు నుంచి వచ్చిన ప్రాజెక్టును బాలీవుడ్‌కు చెందినదిగా ఏ విధంగా పిలుస్తారని ప్రశ్నిస్తున్నారు. జిమ్మి కిమ్మెల్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ‘‘ఆర్ఆర్ఆర్ అనేది తెలుగు సినిమా. దక్షిణాది నుంచి వచ్చింది. కొంత మంది ఆస్కార్ సభ్యులు పేర్కొంటున్నట్టు దాని పేరు బాలీవుడ్ కాదు. ఆ ఇండస్ట్రీని టాలీవుడ్ అంటారు’’ అని ఓ నెటిజన్ తెలిపారు. ‘‘ఆర్ఆర్ఆర్ అనేది బాలీవుడ్ సినిమా కాదు. అది టాలీవుడ్‌కు చెందినది. ఆస్కార్ సభ్యులందరు జాగ్రత్తగా నోట్ చేసుకొండి’’ అని మరో నెటిజన్ చెప్పారు. ‘‘ఇండియాలోని తెలుగు భాషకు చెందిన టాలీవుడ్ అనే ఇండస్ట్రీ ‘ఆర్ఆర్ఆర్’ ను రూపొందించింది. అది ఎంత మాత్రం బాలీవుడ్ చిత్రం కాదు. జిమ్మి కిమ్మెల్ సరి చేసుకోవాలి’’ అని సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ పెట్టారు.
‘ఆర్ఆర్ఆర్’ అంతకు ముందు హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డ్స్‌లోను సత్తాను చాటింది. ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని సైతం గెలుచుకుంది. గోల్డెన్ గ్లోబ్స్‌లోను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలోనే పురస్కారాన్ని కైవసం చేసుకుంది.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Sharon Stone: శృంగార చిత్రం చేయడంతో నా కుమారుడు దూరమయ్యాడు
Comedian Raghu: జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో ఓ పార్ట్.. ఆయన జోలికేస్తే ప్రాణాలు తీస్తా..
Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!
Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు
Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!
Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!
Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్ ఛాన్స్ ఎవరికంటే..?
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్