Tamilisai Soundararajan: మన గవర్నర్, నటుడు సుమన్ మదర్ స్టూడెంట్, ఆమే కాదు కృష్ణ, శోభన్ బాబుల కుమార్తెలు కూడా
ABN, First Publish Date - 2023-06-21T12:13:42+05:30
తెలంగాణ గవర్నర్ తమిళసై, కృష్ణ గారి కుమార్తె పద్మావతి, శోభన్ బాబు కుమార్తె మృదుల, జె డి లక్ష్మీనారాయణ తల్లి గారు వీళ్ళందరూ ఎవరి దగ్గర చదువుకున్నారో తెలుసా? వీళ్ళందరికీ చెప్పిన లెక్టరర్ ఎవరో తెలిస్తే షాకవుతారు
సీనియర్ నటుడు సుమన్ (Suman) నిన్న 'మదర్ ఇండియా' (MotherIndia) అనే ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ మదర్స్ తమ పిల్లల బాగోగుల గురించి ఎంతలా కేర్ తీసుకుంటారు, తల్లి ఆశీస్సులు ఉంటే చాలు, పిల్లలు ఎంత ఎత్తు అయినా ఎదుగుతారు అని చెప్పాడు. అయితే పిల్లలు తప్పు చేశారంటే దానికి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని, వాళ్లనే నిందించాలి అని కూడా చెప్పాడు సుమన్. ఈమధ్య కాలంలో తల్లిదండ్రులు పిల్లల్తో గడపడానికి టైము ఇవ్వడమే లేదని, ఆ ఎఫెక్షన్ లేకపోతే పిల్లలు ఎక్కడ ఎఫెక్షన్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతారని చెప్పాడు సుమన్. అందుకని ఎంత బిజీగా జీవితం వున్నా, పిల్లలతో తల్లిదండ్రులు కొంత సమయం గడపాలని చెప్పాడు సుమన్.
సుమన్ కుమార్తె ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ (NirmalaSitharaman) స్కూల్, ప్రణవ స్కూల్ (PranavaSchool) లో టీచర్ గా పనిచేస్తుందని చెప్పాడు. అయితే ఆమె బస్సులో వెళ్లి వస్తూ ఉంటుందని, బస్సు దిగి మా ఇంటికి అయిదు నిముషాల్లో వెళ్లిపోవచ్చని, కానీ నేను ఆమె బస్సు దిగినచోట నా కారులో ఆమెకోసం వెయిట్ చేస్తూ వుంటాను అని చెప్పాడు సుమన్. ఎందుకంటే అది చిన్న సమయమే అయినా, నాన్నని చూసేసరికి నా కూతురు మోహంలో ఒకరకమైన వెలుగు కనపడుతుందని చెప్పాడు సుమన్.
అలాగే తన కెరీర్ మొదటి నుండి ఈరోజు వరకు తన తల్లే వెనకాల నుండి నడిపిస్తూ ఉంటుంది అని చెప్పాడు. అమ్మకి నేను ఇంజనీర్ అవ్వాలని, నాన్నకి ఏమో నేను డాక్టర్ కావాలని, నాకేమో నేను పైలట్ అవ్వాలని అనుకునేవాడిని. సినిమాలు, నటన అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ మా కారు చెడిపోతే ఒక మెకానిక్ వచ్చి బాగుచేసి వెళ్ళాడు. అతను అడిగాడు, సినిమాలు చేస్తావా అని, చెయ్యని అన్నాను, కానీ మళ్ళీ వచ్చి మా అమ్మగారితో మాట్లాడితే, అమ్మ నన్ను పిలిచి ట్రై చెయ్యి, కానీ ప్రొఫెషనల్ గా తీసుకో అని చెప్పింది.
శిక్షణ లేదు, అనుభవం లేదు, ఆలా ఏమీ లేకుండా కెమెరా ముందుకు వెళ్లి మొదటి సినిమా చేశా. హిట్ అయింది, ఆలా ఈరోజు 45 సంవత్సరాలు సుమారు 700కి పైగా వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు. కానీ ఒక్కసారి కూడా పైలట్ వేషం మాత్రం రాలేదు అని చెప్పారు. చిన్నప్పుడే తన తల్లి సంస్కుతం క్లాసులు పెట్టించి భగవద్ గీత నేర్పించారని, అలాగే కరాటే క్లాసులో కూడా ఆమె నేర్పించారని చెప్పారు. ఆలా ఆమె చెయ్యడం, చెప్పడం వలెనే ఈరోజు నేను ఇంతవాడిని అయ్యాను అని తన తల్లి గురించి గొప్పగా చెప్పాడు సుమన్.
తన తల్లి చెన్నైలో కాలేజీ లెక్చరర్ గా చేసి, వైస్ ప్రిన్సిపాల్ తరువాత ప్రిన్సిపాల్ కూడా అయ్యారని చెప్పారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ (SuperStarKrishna) గారి అమ్మాయి పద్మావతి (Padmavathi), ఇంకో అందమైన నటుడు శోభన్ బాబు (SobhanBabu) కుమార్తె మృదుల (Mrudula), సుమన్ అమ్మగారి వద్దే ట్యూషన్ కి వచ్చేవారని, వాళ్లిద్దరూ ఆమె స్టూడెంట్స్ అని చెప్పాడు సుమన్. అలాగే మన తెలంగాణ గోవర్నర్ (TelanganaGovernor) తమిళసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) ని ఈమధ్య కలిసినప్పుడు, ఆమె కూడా నేను మీ అమ్మగారి స్టూడెంట్ ని అని చెప్పారు. మాజీ సిబిఐ అధికారి జెడి లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) గారి మదర్ కూడా మా అమ్మగారి స్టూడెంట్ అని తెలిసింది. ఇలా అందరూ చెపుతుంటే అప్పుడు మా అమ్మ మీద మరింత గౌరవం ఎక్కువ అయింది.