Tammareddy Bharadwaja: అవార్డులపై ప్రభుత్వాలకి ఆసక్తి లేదు!
ABN, First Publish Date - 2023-04-08T16:38:57+05:30
నంది అవార్డులపై (Nandi Awards Issue) ఏపీ ఎఫ్‌డీసీ అధ్యక్షుడు పోసాని కృష్ణమురళీ (Posani Krishna murali comments) చేసిన సంచలన వ్యాఖ్యలపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
నంది అవార్డులపై (Nandi Awards Issue) ఏపీ ఎఫ్‌డీసీ అధ్యక్షుడు పోసాని కృష్ణమురళీ (Posani Krishna murali comments) చేసిన సంచలన వ్యాఖ్యలపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. (Tammareddy Bharadwaja counter) అవార్డ్ కమిటీలో కమ్మ కులస్తులే ఎక్కువ ఉన్నారన్న పోసాని కామెంట్‌ను ఆయన ఖండించారు. ఆ వ్యాఖ్యలు అతని వ్యక్తిగతమని చెప్పారు. సినిమాలు, అవార్డుల విషయాల్లోకి కులాలు, మతాలను తీసుకురావడం కరెక్ట్‌కాదని అన్నారు.
ఈ మేరకు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘‘పోసాని (Posani)మాటల్లో నాకు ఒకటే అర్థమైంది. ‘ఒకప్పుడు అవార్డులు సరిగ్గా ఇవ్వలేదు... ప్రస్తుత ఆంధ్రా ప్రభుత్వం అవార్డులు ఇస్తే సక్రమంగా ఇచ్చేలా చూస్తాం’ అన్నట్లు నాకు అనిపించింది. అసలు ఈ అవార్డు వ్యవస్థపై ఏ ప్రభుత్వానికి అంత ఆసక్తి లేదు. ‘ఓ వ్యక్తి కేసీఆర్ దగ్గరకు వెళ్లి ఇలాగే అవార్డుల ప్రస్తావన తీసుకొస్తే.. ఎందుకయ్యా ఇదంతా.. అంతా సైలెంట్‌గా ఉన్నప్పుడు ఆ లొల్లిని కదపడం అవసరమా? అన్నారట. ఇది ఎవరో చెప్పగా విన్నాను. ఆయన చెప్పిందీ నిజమే కదా! అసలు లేని అవార్డుల గురించి చర్చ ఎందుకు? శక్తి ఉంటే ప్రభుత్వాలను ఒప్పించి అవార్డులు ఇప్పించగలగాలి. లేదంటే సైలెంట్‌గా ఊరుకోవాలి. ఈ చర్చలు, సమావేశాల వల్ల సమయం వృథా తప్ప కలిసొచ్చేది ఏమీ లేదు. అవార్డులు ఇస్తే కులాలకు ఇచ్చారు, నచ్చిన వాళ్లకు ఇచ్చారు అంటారు. ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు.
అనైక్యత వల్లే... ఇలా... (Groupism in TFI)
సినిమా పరిశ్రమలో ఉన్న అనైక్యత వల్లే ఇలా వెనకబడి ఉన్నాం. పరిశ్రమలో అందరూ కలిసి కట్టుగా ఉండడం నేర్చుకోవాలి. చేసే పనిలో పోటీ ఉండాలి తప్ప... ఈర్ష్య, ద్వేషాల్లో పోటీ ఉండకూడదు. ఇప్పుడు ఇండస్ట్రీతో ఆరోగ్యకరమైన పోటీ కన్నా ఇలాంటివే ఎక్కువ అయ్యాయి. కులతత్వం, గ్రూపిజం ఇవ్వన్నీ పోతేనే పరిశ్రమ బాగుపడుతుంది. వందల కోట్లు పెట్టి తీసిన చిత్రాలే ఆడతాయనే పిచ్చి భ్రమ నుంచి బయటకు రావాలి. ‘ బలగం’ లాంటి చిన్న సినిమాలు కూడా సంచలనం సృష్టిస్తాయి’’ అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.
ఆర్‌ఆర్‌ఆర్’కు అభినందన వేదిక...(RRR)
తెలుగు సినిమాకు ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్’ అవార్డు వచ్చింది. పరిశ్రమ నుంచి ఎవరూ ముందుకొచ్చి ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందాన్ని అభినందించే ప్రయత్నం చేయలేదన్న ప్రశ్నకు ‘‘నామినేషన్‌కి వెళ్లిన రోజే పరిశ్రమ తరఫున ‘ఆర్‌ఆర్‌ఆర్’ బృందాన్ని పెద్ద వేదికగా అభినందించాలనుకున్నాం. రాజమౌళి టీమ్ అవార్డు వచ్చిన తర్వాత చూద్దామన్నారు. ఈ మధ్యనే చాంబర్ తరఫున అడిగాం.. సినిమాకు సంబంధించిన అందరూ అందుబాటులోకి వచ్చాక ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆదివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం’’ అని సమాధానమిచ్చారు.