సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tamanna bhatia: నా అందమైన ప్రపంచంలోకి వచ్చాడు..!

ABN, First Publish Date - 2023-06-13T11:13:43+05:30

మిల్కీబ్యూటీ తమన్నా, విజయ్‌ వర్మలపై వస్తున్న లవ్‌, డేటింగ్‌ రూమర్స్‌కు తమన్నా ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఎట్టకేలకు విజయ్‌వర్మతో రిలేషన్‌లో ఉన్నట్లు ఒప్పుకుంది. వీరిద్దరూ కలిసి ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’లో నటించారు. ఇద్దరికీ మొదటి కాంబినేషన్‌ ఈ సినిమాతోనే. ఆ సెట్స్‌లోనే తమన్నా, విజయ్‌వర్మల మధ్య ప్రేమకథ ప్రారంభమైందని వెల్లడించారు తమన్నా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah), విజయ్‌ వర్మలపై (Vijay varma) వస్తున్న లవ్‌, డేటింగ్‌ రూమర్స్‌కు తమన్నా ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఎట్టకేలకు విజయ్‌వర్మతో రిలేషన్‌లో ఉన్నట్లు ఒప్పుకుంది. వీరిద్దరూ కలిసి ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’లో నటించారు. ఇద్దరికీ మొదటి కాంబినేషన్‌ ఈ సినిమాతోనే. ఆ సెట్స్‌లోనే తమన్నా, విజయ్‌వర్మల మధ్య ప్రేమకథ ప్రారంభమైందని వెల్లడించారు తమన్నా. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. (Tamannaah loves Vijay varma)

‘‘నేను చాలా సింపుల్‌గా ఉండే వ్యక్తిని. అంత ఈజీగా దేనికీ ఎట్రాక్ట్‌ కాను. ఓ అడుగు వేయాలంటే చాలా ఆలోచిస్తా. నేను ఎలాంటి వ్యక్తి కోసం అయితే వెతుకుతున్నానో.. అలాంటి వ్యక్తే నాకు దొరికాడు. విజయ్‌ వర్మ నాకు సూటబుల్‌ పర్సన్‌. సహనటుడు అనే కారణంగా విజయ్‌ వర్మను ఇష్టపడలేదు. నేను చాలామంది నటులతో పనిచేశా. కానీ వారిలో విజయ్‌ నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. స్టార్‌గా ఎదిగిన ఎవరికైనా ఎన్నో సమస్యలు, ఎత్తు పల్లాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో కిందకి లాగే వారు ఎక్కువగా ఉంటారు. అలాంటి విషయాల్లో విజయ్‌ నాకు అండగా ఉంటాడనే నమ్మకం కలిగింది. రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్‌ బంధం ఉంది. మా ప్రేమ ‘లస్ట్‌స్టోరీస్‌’ సెట్‌లో మొదలైంది. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అనుకోకుండానో, అదృష్టంగానో ఆ ప్రపంచంలోకి నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి వచ్చాడు. ఇలాంటి వ్యక్తి కోసమే ఇప్పటిదాకా ఎదురుచూశా. తను ఉన్న ప్రదేశమే నాకు ఆనందమైన ప్రదేశం’ అని తమన్నా పేర్కొన్నారు. లవ్‌, డేటింగ్‌పై చాలాకాలంగా వస్తున్న రూమర్స్‌కు తమన్నా ఇలా చెక్‌పెట్టారు. అన్నీ అనుకూలిస్తే త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కే అవకాశం ఉంది అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. తాజాగా ఆమె నటించిన ‘జీ కర్దా’, లస్ట్‌ స్టోరీస్‌ 2’ అంథాలజీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

కు

Updated Date - 2023-06-13T11:16:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!