సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Swarna manjari: ఆయన లేకుండా ఎన్‌.టి.రామారావుతో తీసిన మొదటి సినిమా !

ABN, First Publish Date - 2023-01-22T11:21:22+05:30

అంజలీ పిక్చర్సు వారి ‘స్వర్ణమంజరి’ (10-08-1962) చిత్రంలోనిది యీ స్టిల్‌. సర్వకళా సమాహారమైన నాట్యం ప్రధానంగా నిర్మించిన ద్విభాషాచిత్రమిది. తెలుగులో ఎన్‌.టి.రామారావు. తమిళంలో జెమినీ గణేశన్‌ కథానాయకులుగా నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంజలీ పిక్చర్సు (anjali pictures) వారి ‘స్వర్ణమంజరి’(swarna manjari) (10-08-1962) చిత్రంలోనిది యీ స్టిల్‌. సర్వకళా సమాహారమైన నాట్యం ప్రధానంగా నిర్మించిన ద్విభాషాచిత్రమిది. తెలుగులో ఎన్‌.టి.రామారావు(N.t.Ramarao) తమిళంలో జెమినీ గణేశన్‌ కథానాయకులుగా నటించారు.

ఈ చిత్రం కథ నిండా మాయలు, మంత్రాలే! ఆది ఇరానీ, మెహ్లి ఇరానీ ట్రిక్‌ ఫోటోగ్రఫీ యీ చిత్రానికి గొప్ప ఆకర్షణ. ఎన్‌.టి.రామారావు యువరాజు చంద్రభానుడిగా ఆ పాత్రకు ముమ్మూర్తులా సరిపోయారు. ధీరోచితంగా, వీరోచితంగా నటించారు. హుందాగా, నిండుగా కనిపించారు. ముఖ్యంగా ‘ఇదియే జీవితానందమూ...’ పాటలో ముగ్ధ మనోహర లలిత శృంగారాన్ని ఆయన బాగా పండించారు. వీర, కరుణ, శృంగార, బీభత్సాది నవరసాలనూ తెరపై అత్యంత సమర్ధవంతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా కరుణ రసావిష్కరణలో అంజలి, కన్నాంబలతో పోటీపడి నటించారు. మత్స్యకన్య (జయంతి) శాపవిముక్తి కోసం ఎన్‌.టి.రామారావు సింహంతో పోరాడిన సన్నివేశంలో, డ్రాగన్‌ను హతమార్చిన సన్నివేశంలో రామారావు చాలా సాహసోపేతంగా నటించారు. అడుగడుగునా ఆకర్షణలతో నిండిపోయిన మంచి జానపద చిత్రంగా మిగిలిపోయింది ‘స్వర్ణమంజరి’. అంజలీ పిక్చర్సు వారి ఆస్థాన కథానాయకుడు అక్కినేని. ఆయన లేకుండా ఎన్‌.టి.రామారావుతో తీసిన మొదటి సినిమా యిది!

- డా. కంపల్లె రవిచంద్రన్‌, 98487 20478.

Updated Date - 2023-01-22T11:21:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!