Surekha vani: ఆనందంగా ఉన్నా... పక్కన లేవనే బాధ ఎక్కువ!
ABN, First Publish Date - 2023-04-30T14:40:56+05:30
నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో ఆమె నటించి ఆకట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల్లో కంటే సోషల్ మీడియాతో మరింత పాపులర్ అయ్యారు.
నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి (Surekhavani)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో ఆమె నటించి ఆకట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల్లో కంటే సోషల్ మీడియాతో మరింత పాపులర్ అయ్యారు. ఆమె గారాల కూతురు సుప్రీతతో (Supritha) కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తుంటారు. కురచ దుస్తులు ధరించి వీరిద్దరూ నెట్టింట రీల్స్, షార్ట్స్ పేరుతో చేసే రచ్చ అంతాఇంతా కాదు. అప్పుడప్పుడు ట్రోలింగ్‌కు కూడా గురవుతారు. అయినా అవేమీ పట్టించుకోకుండా తమకు నచ్చినట్లు స్వేచ్ఛగా ముందుకెళ్తున్నారు. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్బంగా కూతురితో కలిసి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా తన భర్త సురేశ్‌ను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. (Hbd Surekhavani)
‘నా కళ్లలో ఆనందం కన్నా నువ్వు నా పక్కన లేవన్న బాధే ఎక్కువగా ఉంది. కానీ నీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి అని నాకు తెలుసు. నా ప్రతి బర్త్‌డేకి నువ్వు చేసిన హడావిడి ఇప్పటికీ నాకు గుర్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నా. లవ్ యూ ఫర్ ఎవర్ చిన్నా అంటూ ఎమోషనల్ అయ్యింది. 2019లో అనారోగ్యంతో సురేఖ వాణి భర్త మరణించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఆడపాదడపా చిత్రాల్లో కనిపిస్తున్నారు. తన కూతురు సుప్రీతను నటిగా పరిచయం చేయాలని ఆశపడుతున్నారు. అలాగే సుప్రీత గురించి కూడా ఆమె పోస్ట్ చేశారు. ‘‘నా బలం నువ్వు. ఎన్ని కష్టాలను, జీవితంలో ఎదురైన ఎత్తుపల్లాలను అర్థం చేసుకుని నాకు అండగా ఉన్నావు. మీ నాన్న లేకపోయినా మనం ఎంతో ఆనందంగా ఉంటున్నాం అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మన గురించి మాట్లాడిన మాటలు, విమర్శలే మనకు మరింత శక్తినిస్తాయి’’ అని పేర్కొన్నారు.