సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kp Choudary - Surekha Vani: డ్రగ్స్‌తో సంబంధం ఉందా? లేదా పార్టీలో భాగమేనా?

ABN, First Publish Date - 2023-06-24T13:21:49+05:30

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు మరోసారి దుమారం రేపుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన కేపీ చౌదరి అంశం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ కేసులో నిందితుడు, నిర్మాత కేపీ చౌదరి విచారణలో షాకింగ్‌ విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖావాణి పేరు కూడా బయటకు వచ్చింది. అందుకు కారణం కేపీ చౌదరి ఫోన్‌లో సురేఖ, ఆమె కూతురు ఫొటోలు ఉండటమే!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ (Tollywood Drugs Case) కేసు మరోసారి దుమారం రేపుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన కేపీ చౌదరి (Kp Chowdari) అంశం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ కేసులో నిందితుడు, నిర్మాత కేపీ చౌదరి విచారణలో షాకింగ్‌ విషయాలు బయటకొస్తున్నాయి. కోర్టు అనుమతితో పోలీసులు నిందితుడిని రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. అతని ఫోన్‌ డేటా చూస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. కేపీ ఫోన్‌లో పలువురు సెలబ్రిటీల ఫొటోలూ ఉన్నాయి. వారందరికీ డ్రగ్స్‌ విక్రయించాడా..? లేదా అనే కోణంలో విచారణ జరుగుతుంది. కాల్‌ డేటాను బట్టి ఇందులో అషురెడ్డికి (Ashu Reddy) కూడా భాగం ఉన్నట్లు భావిస్తున్నారు.

తాజాగా ఈ కేసులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖావాణి (surekha Vani) పేరు కూడా బయటకు వచ్చింది. అందుకు కారణం కేపీ చౌదరి ఫోన్‌లో సురేఖ, ఆమె కూతురు ఫొటోలు ఉండటమే! ఒక పార్టీలో సురేఖా.. అతనికి ముద్దు పెడుతూ ఉన్న ఫోటో, మరో ఫోటోలో సుప్రీత కూడా కేపీతో క్లోజ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో సురేఖా - సుప్రీత ఇద్దరూ డ్రగ్స్‌ వ్యవహారంలో ఉన్నారని ప్రచారంజరుగుతోంది. కొందరైతే కేపీతో ఫొటోలు దిగినంత మాత్రాన డ్రగ్‌కి వారికి సంబంధం ఉన్నట్లేనా, వారు కూడా తప్పు చేసినట్లేనా అని కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ విషయంపై సురేఖావాణి స్పందిస్తే కానీ నిజమేంటనేది తెలుస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలను బట్టి చూస్తే ఆర్టిస్ట్‌ జ్యోతి (Jyothy)కూడా ఇందులో భాగమే అని భావిస్తున్నారు.

Updated Date - 2023-06-24T13:40:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!