Suhasini: ఇప్పుడొస్తున్న సినిమాలపై సుహాసిని హాట్ హాట్ కామెంట్స్
ABN, Publish Date - Dec 24 , 2023 | 04:46 PM
తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని నటి సుహాసిని. తనదైన నటనతో దక్షిణ భారత దేశ సినీ రంగంపై చెరగని ముద్ర వేసిన సుహాసిని ఇప్పుడొస్తున్న సినిమాలపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో మీరు చూస్తున్న మార్పు ఏమిటని సుహాసినిని అడిగితే.. ‘భయంకరమైన హింస’ అంటూ ఆమె చాలా ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని నటి సుహాసిని మణిరత్నం (Suhasini Maniratnam). తనదైన నటనతో దక్షిణ భారత దేశ సినీ రంగంపై చెరగని ముద్ర వేసిన సుహాసిని ఇప్పుడొస్తున్న సినిమాలపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో మీరు చూస్తున్న మార్పు ఏమిటని సుహాసినిని అడిగితే.. ఆమె చాలా ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘హింస.. సినిమాల్లో హింస విపరీతంగా పెరిగిపోయింది. నేను ఫిల్మ్‌మేకింగ్ నేర్చుకున్నా. గత నాలుగు దశాబ్దాలలో సినిమాల్లో ఇంత హింసను ఎప్పుడూ చూడలేదు. దీనికి మూడు కారణాలు ఉన్నాయనుకుంటున్నా. ఓటీటీ (OTT) మన జీవితాల్లో ప్రవేశించిన తర్వాత తీవ్రమైన హింస సామాన్యమైపోయింది. ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. సాధారమైన ఫైట్స్ ఎక్కువ మందికి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్‌లా అనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఇంతకు ముందు ఎవరైనా కోపంతో ‘తల తీసేస్తా’ అన్నారనుకోండి. అది డైలాగ్ వరకే ఉండేది. ఇప్పుడు తలను నరికేయటం చూపిస్తున్నారు. ఈ మధ్య ఒక తమిళ సినిమాలో చెవిని నరికేయటం చూపించారు. మరో సినిమాలో తలను నరికేయటం చూపించారు. (Suhasini Comments on Movies)
కొందరు డైరెక్టర్స్‌ను మీరు ఎందుకంత వయలెన్స్ చూపిస్తున్నారని అడిగా. ‘ఓటీటీ వల్ల అతి హింస లేకపోతే చూడటం లేదు మేడమ్’ అన్నారు. ఇక రెండో కోణం సమాజంలో స్వార్థం పెరిగిపోవటం. ప్రశ్నించే గొంతులు తగ్గిపోవటం. దీనితో తాము చేయలేనిది- హీరో చేస్తుంటే చాలా ఆనందంగా చూస్తున్నారు. దీనితో పాటుగా- పురుషులతో పాటు మహిళలు కూడా హింసను ఎంజాయ్ చేస్తున్నారు. ‘నెక్ట్ లెవెల్.. గూస్‌బంప్స్’ అనే కామెంట్స్ అమ్మాయిల దగ్గర నుంచి కూడా వింటున్నా..’’ అని సుహాసిని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
====================
*Bonda Mani: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
*******************************
*Salaar: రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్.. రెండో రోజూ కలెక్షన్ల ‘వరదే’!
********************************
*Sriya Reddy: పవన్ ‘ఓజీ’లో చేస్తున్నందుకు అంతా ఏమంటున్నారంటే?
*********************************
*Ram Charan ISPL: ఐపీఎల్‌లో కాదు ఐఎస్‌పీఎల్‌లో రామ్ చరణ్‌కు టీమ్.. హైదరాబాదే!
*******************************
*RGV: ‘వ్యూహం’ బెడిసికొట్టింది.. వర్మా.. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు
******************************