Cable Reddy: ఈ హీరోకి టైటిల్స్ భలే కుదురుతున్నాయ్..
ABN, First Publish Date - 2023-08-19T11:32:46+05:30
‘కలర్ ఫొటో’, ‘రైటర్ పద్మభూషణ్’, అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్’.. ఈ టైటిల్స్ ఒక్కసారి గమనిస్తే.. ఒకదానికొకటి అస్సలు సంబంధం ఉండదు. అలా కుదురుతున్నాయ్ హీరో సుహాస్ (Hero Suhas)కు టైటిల్స్. తాజాగా ఆయన హీరోగా మరో చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘కేబుల్ రెడ్డి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
‘కలర్ ఫొటో’, ‘రైటర్ పద్మభూషణ్’, అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్’.. ఈ టైటిల్స్ ఒక్కసారి గమనిస్తే.. ఒకదానికొకటి అస్సలు సంబంధం ఉండదు. అలా కుదురుతున్నాయ్ హీరో సుహాస్ (Hero Suhas)కు టైటిల్స్. తాజాగా ఆయన హీరోగా మరో చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమాకు కూడా మరో వైవిధ్యమైన టైటిల్ సెట్ అవడం చూస్తుంటే.. ఈ హీరోకి టైటిల్స్ భలే కుదురుతున్నాయంటూ నెటిజన్లు మాట్లాడుకుంటుండటం విశేషం. ‘కలర్ ఫొటో’, ‘రైటర్ పద్మభూషణ్’తో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న హీరో సుహాస్.. ఇప్పుడు మరో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ కోసం నూతన దర్శకుడు శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy)తో చేతులు కలిపారు. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కేబుల్ రెడ్డి’ (Cable Reddy) అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఫిక్స్ చేశారు. షాలిని కొండేపూడి (Shalini Kondepudi) ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని తాజాగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. శ్రీధర్ రెడ్డి(దర్శకుడు) కెమెరా స్విచాన్ చేయగా.. ‘హిట్’ సిరీస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీధర్ మంచి స్నేహతుడు. తనకి ఇది తొలి చిత్రం. రెండు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ మూవీ ఇది. చాలా ఎక్సయిటింగా ఉంది. మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాననే నమ్మకంతో ఉన్నానని అన్నారు. (Suhas Starring Cable Reddy Movie Launched)
దర్శకుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతే ఆసక్తికరంగా, యంగేజింగా షూట్ చేయడానికి సన్నాహాలు చేశాం. ఒక టౌన్‌లో జరిగే కథ ఇది. క్లీన్ ఎంటర్‌టైనర్‌గా వుంటుంది. తప్పకుండా ప్రేక్షకుల మన్ననలను అందుకుంటుందనే కాన్ఫిడెన్స్‌తో షూట్‌కి వెళ్లబోతున్నామని అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్ షాలిని కొండేపూడి ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత బాలు వల్లు మాట్లాడుతూ.. ఇది మా మొదటి సినిమా. చాలా మంచి టీంతో పని చేస్తున్నాం. బౌండెడ్ స్క్రిప్ట్‌తో షూట్‌కి వెళ్తున్నాం. మొదటి షెడ్యుల్ 20 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు. స్మరణ్ సాయి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
***************************************
*Udhayanidhi Stalin: ఆ నిర్ణయంలో మార్పులేదు
****************************************
*Brahmanandam: అంగరంగ వైభవంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రెండో కుమారుడి వివాహం
***************************************
*Bheemadevarapally Branchi: ఓటీటీలోకి వచ్చేసిన భీమదేవరపల్లి బ్రాంచి..
***************************************