సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

SS Rajamouli: టాప్‌ 100లో ఒకరు... కారణం అదే..!

ABN, First Publish Date - 2023-04-14T11:34:51+05:30

టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి మరో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో రాజమౌళి నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) మరో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో రాజమౌళి నిలిచారు. 2023కి గాను టైమ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘టాప్‌-100 వరల్డ్‌ ఇన్ల్పూయెన్షిల్‌ పీపుల్‌’ (Times100 most influential people) జాబితాలో రాజమౌళికి చోటు దక్కించుకున్నారు. ఆయనతోపాటు బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌, రచయిత సల్మాన్‌ రష్దీ, టీవీ వ్యాఖ్యాత పద్మలక్ష్మీ.. భారత్‌ నుంచి ఈ జాబితాలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, కింగ్‌ చార్లెస్‌, ఎలాన్‌ మస్క్‌, సాకర్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ తదితర ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ దర్శకుల్లో రాజమౌళి (RRR) మొదటివారని విశ్లేషకులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎన్టీఆర్‌(Ntr), రామ్‌చరణ్‌ (Ram charan) కీలక పాత్రధారలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే! అంతర్జాతీయ వేదికలపై గోల్డెన్‌ గ్లోబ్‌, 28వ క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుతో పాటు సినిమా రంగం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారంగా భావించే ఆస్కార్‌ కూడా ఈ చిత్రాన్ని వరించింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘నాటునాటు’ పాటకు 95వ ఆస్కార్‌ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌ ఆస్కార్‌ వేదికపై అవార్డును అందుకున్నారు. తెలుగు సినిమాకు వచ్చిన తొలి ఆస్కార్‌ అవార్డ్‌ ఇది.

Updated Date - 2023-04-14T12:35:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!