SS Rajamouli Emotional post : అప్పుడే 20 ఏళ్లు గడిచాయా?..ఎన్నో పాఠాలు నేర్చుకున్నా!
ABN, First Publish Date - 2023-07-28T12:20:15+05:30
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి (SS rajamouli) ట్విట్టర్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ నిర్మించి 20 (Prasads Multiplex completes 20 years) ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ థియేటర్‌తో ఉన్న జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి (SS rajamouli) ట్విట్టర్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ నిర్మించి 20 (Prasads Multiplex completes 20 years) ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ థియేటర్‌తో ఉన్న జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ‘మనలో చాలామందికి సినిమా అనేది ఓ ఎమోషన్. బాధ కలిగినా, బోర్ కొట్టినా, ఆనందంలో ఉన్నా.. సినిమా చూస్తాం. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఎన్నో జ్ఞాపకాలు పోగేసుకుంటాం. ఎన్నో నేర్చుకుంటాం. అలాంటి థియేటర్స్‌ని మరచిపోలేం’’ అంఊ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు దర్శకుడు రాజమౌళి. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ ప్రాంగణంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ నిర్మించి ఈ నెల 25వ తేదికి 20 ఏళ్లు పూర్తయింది. ఆ మల్టీప్లెక్స్‌తో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ రాజమౌళి ఎమోషనల్ అయ్యారు.
‘‘ఎన్ని శుక్రవారాలు. (Friday Show)
ఫస్ట్ డే ఫస్ట్ షోలు (1000 Friday Shows)
8.45 షోకి సీట్లో ఉండాలనే ఆతురత...
అప్పుడే 20 ఏళ్లు గడిచాయా?
సినిమా విజయం అందుకున్నా, అందుకోలేకపోయినా ఇక్కడ చూసిన ప్రతి సినిమా నాకు పాఠం నేర్పింది. డియర్ ప్రసాద్స్.. నువ్వు సినిమా మాత్రమే కాదు.. నువ్వు నా క్లాస్‌రూమ్’’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఓ కుర్రాడు బాల్యంలో మొదటిసారి ప్రసాద్స్‌లో అడుగుపెట్టింది మొదలు.. స్కూల్, కాలేజ్, ఆఫీస్ మొదలుకొని పెళ్లి అయ్యి తన బిడ్డను ఆ థియేటర్‌కి తీసుకువచ్చే వరకూ ఆ థియేటర్‌తో తనకున్న అనుబంధాన్ని ఆ వీడియోలో చూపించారు. ఆ వీడియో ప్రతి ఒక్క ఆడియన్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. రాజమౌళి ట్వీట్‌తో ఎంతో మంది ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌తో ఉన్న అనుబంధాన్ని ట్విట్టర్ షేర్ చేశారు.