SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్
ABN, First Publish Date - 2023-03-23T15:38:48+05:30
దర్శక ధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli) తన తర్వాతి సినిమాను మహేశ్ బాబు (Mahesh Babu) తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసకుడి నేపథ్యంలో చిత్రం రూపొందనుంది. ఫారెస్ట్ అడ్వెంచర్‌గా తెరకెక్కనుంది.
దర్శక ధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli) తన తర్వాతి సినిమాను మహేశ్ బాబు (Mahesh Babu) తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసకుడి నేపథ్యంలో చిత్రం రూపొందనుంది. ఫారెస్ట్ అడ్వెంచర్‌గా తెరకెక్కనుంది. ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (SSMB29) అని వ్యవహరిస్తున్నారు. జక్కన్న గత చిత్రాల మాదిరిగానే ఈ ప్రాజెక్టులోను భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని సమాచారం. అందువల్ల సినిమా షూటింగ్‌కు ముందే రాజమౌళి దాదాపుగా ఆరు నెలల పాటు వర్క్‌షాప్స్‌ను నిర్వహించనున్నారని తెలుస్తోంది. వివిధ డిపార్ట్‌మెంట్స్‌కు ట్రైనింగ్ ఇవ్వనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రీన్ మ్యాట్స్ ఉపయోగించే విధానం మరికొన్ని అంశాలపై ఈ వర్క్‌షాప్స్ నిర్వహించనున్నారని సమచారం అందుతుంది. ఈ వర్క్‌షాప్స్ 2023 చివరలో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. తన గత చిత్రాల కంటే భారీగా మహేశ్ బాబు ప్రాజెక్టు ఉంటుందని రాజమౌళి వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పారు.
మహేశ్ బాబు సినిమా గురించి రాజమౌళి గతంలో అమెరికన్ మీడియాతో మాట్లాడారు. ‘‘నా తర్వాతి సినిమా మహేశ్ బాబుతో చేస్తున్నాను. ఆయన పెద్ద సూపర్ స్టార్. ఇండియానా జోన్స్ తరహాలో ఈ చిత్రం ఉంటుంది. చాలా కొత్తగా, భారీ బడ్జెట్‌తో రూపొందనుంది’’ అని జక్కన్న స్పష్టం చేశారు. మహేశ్ బాబు ప్రస్తుతం త్రి విక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ అని వ్యవహరిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ పూర్తి కాగానే రాజమౌళి ప్రాజెక్టుపై మహేశ్ బాబు దృష్టి సారిస్తారు.
^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Mrunal Thakur: నా కథను ప్రపంచానికి చెబుతా.. కన్నీరు కారుస్తున్న ఫొటోను షేర్ చేసిన మృణాల్..
Thalaivi: వివాదంలో కంగన సినిమా.. కోర్టును ఆశ్రయించనున్న డిస్ట్రిబ్యూటర్..
Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..
Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా
Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..
RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!
Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!
Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు