సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mohan Lal: చాలా పెద్ద ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్ కుమారుడు

ABN, First Publish Date - 2023-07-13T12:45:34+05:30

సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్ళిసందD' అనే సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయిన సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ లో మోహన్ లాల్ తో చెయ్యబోతున్నాడు.

Roshan Meka
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు (Srikanth) రోషన్ మేక (RoshanMeka) చాలా పెద్ద ఛాన్స్ కొట్టేసాడు. కొన్ని రోజుల క్రితం ఏక్తా కపూర్ (EktaKapoor), మోహన్ లాల్ (MohanLal) కలిసి ఒక పాన్ ఇండియా మూవీ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి నంద కిషోర్ (NandaKishore) దర్శకుడు అని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలోకి మన తెలుగు నటుడు కూడా చేరుతున్నాడు. అతను మరెవరో కాదు, శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక (RoshanMeka).

రోషన్ ఈ సినిమాలో మోహన్ లాల్ (MohanLal) కొడుకుగా నటిస్తున్నాడు అని ఒక అధికార ప్రకటనలో చిత్ర నిర్వాహకులు ఈరోజు చెప్పారు. రోషన్ ఇంతకు ముందు రాఘవేంద్ర రావు (KRaghavendraRao) పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' #PelliSandaD అనే సినిమా ద్వారా కథానాయకుడిగా ఆరంగేట్రం చేసాడు. ఆసక్తికరం ఏంటంటే ఆ సినిమాతో శ్రీలీల (Sreeleela) కూడా తెలుగు తెరకి కథానాయికగా పరిచయం అయింది.

ఆలా పరిచయం అయిన రోషన్ ఇప్పుడు ఈ పాన్ ఇండియన్ సినిమాలో మోహన్ లాల్ పక్కన చేస్తున్నాడు అంటే చాలా పెద్ద ఛాన్స్ కొట్టేసినట్టే. ఈ సినిమా అన్ని భాషల్లోనూ విడుదల అవుతోంది. తెలుగు, మలయాళం లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది, కానీ విడుదల మాత్రం హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో ఉంటుంది అని చెప్పారు. ఇది ఒక యాక్షన్ సినిమాగా చెప్పారు, ఇందులో గ్రాఫిక్స్ కి చాలా ప్రాముఖ్యం వుంది అని కూడా అంటున్నారు.

ప్రముఖ నటుడు జితేంద్ర (Jeetendra) కుమార్తె ఏక్తా కపూర్ (EktaKapoor), టీవీ సీరియల్స్ చాలా చేశారు, అలాగే హిందీ సినిమాలు కూడా నిర్మించారు, మొదటి సారిగా దక్షిణాదికి వచ్చి ఒక పెద్ద సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నారు. అది కూడా ఒక పాన్ ఇండియా సినిమా, అన్ని భాషల్లో విడుదల అవుతోంది అంటే ఈ సినిమాకి చాలా భారీ బడ్జెట్ పెడుతున్నారని అర్థం అవుతోంది.

Updated Date - 2023-07-13T12:45:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!