సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sridevi biography : ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌

ABN, First Publish Date - 2023-02-09T15:24:29+05:30

దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ కథానాయికగా తన హవా కొనసాగించారు అతిలోక సుందరి శ్రీదేవి. వైవిధ్యమైన పాత్రలతో ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ కథానాయికగా తన హవా కొనసాగించారు అతిలోక సుందరి శ్రీదేవి(sridevi). వైవిధ్యమైన పాత్రలతో ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆమె జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో ఆసక్తికర విషయాలను ఇప్పుడు పుస్తక రూపంలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ పరిశోధకుడు ధీరజ్‌ కుమార్‌ శ్రీదేవి బయోగ్రఫీని (Sridevi's biography)‘‘ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’ (The Life Of A Legend)పేరుతో రచించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఇది నేను చేస్తున్న తొలి బయోగ్రఫీ. ఈ సాహసం చేయడానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌, కుమార్తెలు జాన్వీ, (Janhvi Kapoor) ఖుషీ కపూర్‌కు ధన్యవాదాలు. ఈ పుస్తకం విషయంలో బోనీ కపూర్‌ (boney kapoor)ఆనందం వ్యక్తం చేశారు’’ అని తెలిపారు. ఈ ఏడాదిలో ఈ పుస్తకాన్ని విడుదల చేసే అవకాశం ఉందని బోనీ అన్నారు.

దీనిపై బోనీకపూర్‌ మాట్లాడుతూ ‘‘శ్రీదేవి ఒక ప్రకృతి శక్తి. ఆమె ఒక అద్భుతం. తనకు నటన అంటే ఎంతో ఇష్టం. స్ర్కీన్‌పై కనిపించినప్పుడు అభిమానుల నుంచి వచ్చే స్పందన చూసి చాలా సంతోషించేది. తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచేది. మా కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావించే దీరజ్‌ ఆమె జీవిత చరిత్రను పుస్తకంగా రాయడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

నటిగా 300లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె 2012లో చేసిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ (english vinglish) అత్యంత ప్రశంసలు అందుకొంది. ఈ చిత్రాన్ని ఆమె ఐదో వర్థంతి సందర్భంగా ఈ నెల 24 చైనాలో విడుదల చేయనున్నారు. అక్కడ 6000 థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

Updated Date - 2023-02-09T15:51:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!