సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sreeleela: తెలుగు పరిశ్రమలో ఒక్కరే హీరోయిన్, మరెవరూ లేరా, సంచలనంగా వున్న లైనప్

ABN, First Publish Date - 2023-05-06T16:54:18+05:30

శ్రీలీల పేరే వినపడుతోంది తెలుగు పరిశ్రమలో కథానాయకురాలు అనగానే. దాదాపు పది సినిమాలకు పైగా సినిమాలు చేస్తున్న ఏకైక నటి ఎవరైనా వున్నారు అంటే అది ఒక్క శ్రీలీల మాత్రమే అని చెప్పాలి. ఆమె లైనప్ ఒక్కసారి చూస్తే...

Sreeleela
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీలీల (Sreeleela) ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి దర్శకుడు, నిర్మాత శ్రీలీల నే తమ సినిమాలో కథానాయకురాలిగా ఉండాలి అనుకుంటున్నట్టుగా వున్నారు. అందుకనే ఆమె ఒక్కర్తే హీరోయిన్ గా కనపడుతున్నట్టు వుంది, లేకపోతే ఇన్ని సినిమాలు లైనప్ లో ఉండటం ఏంటి, ఆమె తప్పితే వేరే వాళ్ళు లేనట్టు అగ్రనటులు పవన్ కళ్యాణ్ (PawanKalyan), మహేష్ బాబు (MaheshBabu) లాంటి వాళ్ళ పక్కన కూడా ఆమె కథానాయకురాలు ఏంటి. ఇప్పుడు ఆమె ఒక సంచలనం అయింది.

సీనియర్ దర్శకుడు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు (K Raghavendra Rao) పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లి సందD' (Pelli SandaD) అనే సినిమాతో పరిచయం చేసిన అమ్మాయి శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ (Roshan) ఇందులో కథానాయకుడు. అంతే అక్కడ నుండి ఇక వెనక్కి చూసుకోకుండా సినిమాలు చాలా చేతిలో వున్నాయి. ఆమధ్య విడుదల అయిన రవితేజ (Ravi Teja) నటించిన 'ధమాకా' (Dhamaka) అనే సినిమాలో ఆమె మంచి డాన్సర్ అని ప్రూవ్ చేసుకుంది. ఆ సినిమా హిట్ అవడానికి శ్రీలీల కూడా ఒక కారణం.

అటువంటి శ్రీలీల ఇప్పుడు సినిమాల లైనప్ చూస్తే కనక షాక్ అవుతారు. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో వస్తున్న #SSMB28లో శ్రీలీల రెండో కథానాయకురాలు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagath Singh) లో కూడా వుంది, ఇంక నందమూరి బాలకృష్ణ (Balakrishna), అనిల్ రావిపూడి (AnilRavipudi) సినిమాలో బాలకృష్ణ కూతురుగా వేస్తోంది అని అన్నారు. నితిన్ (Nithiin), దర్శకుడు వక్కలంక వంశీ సినిమాలో కథానాయకురాలిగా చేస్తోంది, అలాగే రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి శ్రీను (BoyapatiSrinu) సినిమాలో కూడా చేస్తోంది. ఇవన్నీ షూటింగ్ జరుగుతున్నాయి. ఇవి కాకుండా నవీన్ పోలిశెట్టి సినిమా 'అనగనగా ఒక రోజు', వైష్ణవ తేజ్ సినిమాలో, కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసిన విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో కూడా ఈమె కథానాయకురాలు. ఇవన్నీ కాకుండా జూనియర్ అనే సినిమాలో కూడా వుంది అంటున్నారు.

ఇప్పుడు చెప్పిన సినిమాలు పది వరకు ఉంటే, ఇంకా టాక్స్ లో వున్నవి ఇంకా వున్నాయి అంటున్నారు. అంటే ఈమె కావాలి అని అందరూ అనుకుంటున్నారేమో. పాపం ఆమె కూడా ఎన్నని సినిమాలు చేస్తుంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

Updated Date - 2023-05-06T16:54:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!