సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sravanthi chokarapu: నా డ్రెసింగ్‌ నా ఇష్టం... మీకేంటి ప్రాబ్లమ్‌!

ABN, First Publish Date - 2023-02-23T14:09:53+05:30

ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఆపై మోడల్‌గా కొనసాగి యాంకర్‌, నటిగా మారారు స్రవంతి చొక్కారపు(Sravanthi chokarapu). (జబర్దస్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఆపై మోడల్‌గా కొనసాగి యాంకర్‌, నటిగా మారారు స్రవంతి చొక్కారపు(Sravanthi chokarapu). (జబర్దస్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తదుపరి పుష్ప (Pushpa) సినిమా ప్రమోషన్‌లో భాగంగా బన్నీ - సుకుమార్‌- దేవిశ్రీ ప్రసాద్‌లను రాయలసీమ స్లాంగ్‌లో చేసిన ఇంటర్వ్యూతో మరింత పాపులారిటీ వచ్చింది. అదొక లైప్‌ టర్నింగ్‌ పాయింట్‌ (Life turning point) అని ఆమె చెబుతుంటారు. పుష్ఫ ఇంటర్వ్యూ ఫేంతో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ (sravanthi Biggboss nonstop season) సీజన్‌లో అవకాశం అందుకొంది. తర్వాత తన లైఫ్‌ మారిందని చెబుతోంది. ప్రస్తుతం మరో టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు స్రవంతి.. గలగలా మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె ఎన్నో సందర్భాల్లో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. తాజాగా ఆమె మరోసారి ట్రోల్‌ అయ్యారు. ఇటీవల గోవా వెళ్లిన ఆమె బీచ్‌లో వైట్‌ బ్యాక్‌లెస్‌ గౌన్‌తో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ ‘గోయింగ్‌ విత్‌ ట్రెండ్‌’ అని పోస్ట్‌ చేశారు. అవి వైరల్‌ కావడమే కాకుండా నెటిజన్ల నుంచి విపరీతంగా కామెంట్లు తీసుకొచ్చాయి. కొందరు ఏంజెల్‌ అంటూ కామెంట్‌ చేస్తే... ఓ నెటిజన్‌ మాత్రం ఫైర్‌ అయ్యాడు. ‘ఒక బిడ్డకు తల్లైన నువ్వు... రేపటి రోజున నీ బిడ్డ ఈ ఫొటోలు ఉన్నది నువ్వేనా మమ్మీ అని అడిగితే ఏం సమాధానం చెబుతావ్‌’ అంటూ ఓ కామెంట్‌ చేశారు. ఇలాంటి కామెంట్లపై తాజాగా స్రవంతి స్పందించారు. ‘‘నేను ఈ రోజున ఈ స్థాయికి వచ్చాను అంటే దీని వెనుక పదేళ్ల కష్టం ఉంది. కష్టపడితే ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. నా పదేళ్ల కష్టానికి ఫలాల రూపంలో ఫలితం ఇప్పుడు వస్తుంది. నాకు పర్ఫెక్ట్‌ హౌస్‌ వైఫ్‌లా ఉండటం నాకిష్టం. కానీ వర్క్‌ వస్తుంది కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ.. ముందుకెళ్తున్నా. మార్చి చివర్లో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా’’ అని అన్నారు.

రూమర్స్‌ది ఏముంది... మామూలే... (Sravanthi chokarapu Fire on netizens)

పెళ్లై, బిడ్డను కన్నాను కాబట్టి.. సోషల్‌ మీడియాలో చాలామంది నా డ్రెసింగ్‌ మీద కామెంట్స్‌ చేస్తుంటారు. మన వాళ్లేగా కామెంట్‌ చేసేది అనుకుంటా. నాది బెస్ట్‌ స్మైల్‌ అని చాలామంది పొగిడారు. నా గురించి ఎవరన్నా కామెంట్‌ చేస్తే ఆ చిరునవ్వే నవ్వుతా. ఈ మధ్యన కూడా సోషల్‌ మీడియాలో నా ఫొటోలపై కామెంట్‌ చేశారు. నా డ్రెసింగ్‌ విషయంలో నా కుటుంబ సభ్యులే ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.. సో.. బయటి వాళ్లు అనుకుంటే నాకేంటి? ’’ అని అన్నారు.

Updated Date - 2023-02-23T14:13:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!