Sobhita Dhulipala: సమంతను అలా చూసి తట్టుకోలేకపోయా!
ABN, First Publish Date - 2023-04-03T13:49:24+05:30
‘గూఢచారి’ చిత్రంతో సినీ ప్రియులకు పరిచయమైన తెలుగమ్మాయి శోభితా ధూళిపాల. ‘మేజర్’, ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాలతో ఆకట్టుకున్న ఆమె తెలుగు, తమిళ, హిందీలో వరుస చిత్రాలు చేస్తున్నారు.
‘గూఢచారి’ (Gudachari) చిత్రంతో సినీ ప్రియులకు పరిచయమైన తెలుగమ్మాయి శోభితా ధూళిపాల. ‘మేజర్’, ‘పొన్నియన్ సెల్వన్’ (Ponnien selvan 2) చిత్రాలతో ఆకట్టుకున్న ఆమె తెలుగు, తమిళ, హిందీలో వరుస చిత్రాలు చేస్తున్నారు. ఇంగ్లిష్ లో ఓ అమెరికన్ సిరీస్ కూడా చేశారు. ప్రస్తుతం ఆమె వైజాగ్‌లో సందడి చేస్తున్నారు. తన సోదరి సమంత వివాహ వేడుకల్లో ఆమె బిజీగా ఉన్నారు. మెహందీ, సంగీత్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోదరిని పెళ్లి కూతురుగా చూసి ఆమె భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు. Samantha marriage celebrations)
‘‘బంధువులు అందరితో ఇల్లు కళకళలాడుతోంది. చాలా కాలం తర్వాత ఇలా కుటుంబ సభ్యులు అందరినీ కలిశా. సోదరి పెళ్లి వేడుక కోసం అందంగా ముస్తాబు కావాలనుకున్నా. కాకపోతే పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వల్ల మెహందీకి సరిగ్గా రెడీ కాలేకపోయాను. సమంతను పెళ్లి కుమార్తెగా చూస్తుంటే భావోద్వేగంగా లోనై, ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి’’ అని శోభిత ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. సంగీత్ ఎంతో సందడిగా జరిగిందని, అందరితో కలిసి డాన్స్ చేశానని, ఈ మధుర క్షణాలు మరువలేను’’ అని తెలిపారు. తాజాగా శోభిత నటించిన ‘పొన్నియిన్ సెల్వన్ -2’ ఈ నెల 28న విడుదల కానుంది. ‘సితార’, ‘మంకీ మేన్’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.