Sobhita Dhulipala : ఆ అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదంటారు!
ABN, First Publish Date - 2023-09-11T12:47:58+05:30
తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) ఇటు దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ చక్కని అవకాశాలు అందుకుంటూ కథానాయికగా రాణిస్తోంది. అంతే కాదు వెబ్, టీవీ సిరీస్‌లతోనూ మెప్పిస్తోంది. ఈ ఏడాది ‘పొన్నియన్ సెల్వన్-2’తో అలరించిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమాతోపాటు అమెరికన్ చిత్రంతో బిజీగా ఉంది.
తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) ఇటు దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ చక్కని అవకాశాలు అందుకుంటూ కథానాయికగా రాణిస్తోంది. అంతే కాదు వెబ్, టీవీ సిరీస్‌లతోనూ మెప్పిస్తోంది. ఈ ఏడాది ‘పొన్నియన్ సెల్వన్-2’తో అలరించిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమాతోపాటు అమెరికన్ చిత్రంతో బిజీగా ఉంది. అలాగే ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్‌తో అలరిస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ‘‘నటి అనే బాధ్యతను భుజాన వేసుకున్నాక ఫలానా పాత్రలే చేస్తానంటే కుదరదు. నాకొచ్చిన అవకాశాల్లోంచి మంచి పాత్రల్ని ఎంచుకుంటున్నా. వందశాతం మనసు పెట్టి పని చేస్తున్నా. ‘ఎప్పుడూ తెరపై కనిపించాలి. నాకు చేతి నిండా పని ఉండాలి.. అనే ఉద్దేశంతో ఏ పాత్ర పడితే అది చేయను. నాకున్న అభిరుచుల మేరకు, ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని వచ్చిన అవకాశాల్లోంచి మంచి పాత్రలు ఎంచుకుంటాను’’ అని చెప్పుకొచ్చారు. కమర్షియల్‌గా సక్సెస్ అయిన జోయా అక్తర్ ‘మేడ్ ఇన్ హెవెన్-2’లో ప్రధాన పాత్ర నాకివ్వడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అలాగే మణిరత్నం సర్ ‘పొన్నియిన్ సెల్వన్’లో మంచి ప్రాధాన్యం ఉన్న వాణతి పాత్రనిచ్చారు. నాలో ఉన్న ప్రతిభ గుర్తించే ఈ అవకాశం నా చెంతకు వచ్చిందనుకుంటున్నాను. ‘మేడ్ ఇన్ హెవెన్ 2’లోని తార పాత్ర నా జీవితానికి దగ్గరగా ఉంటుంది.
మూడేళ్లుగా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో భిన్నమైన పాత్రలు పోషించా. నా పనితీరు దర్శకనిర్మాతతతోపాటు ప్రేక్షకులకు నచ్చిందనే భావిస్తున్నాను. నేను సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నాను కాబట్టే వాళ్లు నన్ను మళ్లీ ఆదరిస్తున్నారు. అందుకే మంచి పాత్రలు ఎంచుకుంటున్నా.
‘‘డాన్ 3’ చిత్రంలో కథానాయికగా ఎంపికయ్యావా?’ అని చాలామంది అడుగుతున్నారు. ‘డాన్’ ఒక క్లాసిక్ సినిమా. దానికి కొనసాగింపుగా వస్తున్న ‘డాన్ 3’లో భాగంగా కావాలని ఎవరికి మాత్రం ఉండదు? అది ఊహించుకుంటేనే చాలా ఉద్వేగంగా ఉంది. ‘డాన్ 2’లో రోమా పాత్రలో ప్రియాంకా అద్భుతంగా నటించారు. మూడో భాగంలో ఆడిషన్ ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. యాక్షన్, డ్యాన్స్, కామెడీ ఉన్న సినిమాలో నటించాలనేది ఎప్పట్నుంచో నా కోరిక. వచ్చిన పాత్రను ఎంపిక చేసుకోవడం తప్ప అవకాశాలు మన చేతుల్లో ఉండవు. అలా జరిగితే.. కరణ్ జోహార్, ఫరాఖాన్‌లాంటి గొప్ప దర్శకులతో కలిసి పని చేస్తాను. ఆ అవకాశం లేకపోవడంతో ఒప్పుకున్న సినిమాల్నే వందశాతం మనసు పెట్టి చేస్తున్నాను.