Producer SKN: బాధ్యత గల నిర్మాతగా ఆ పని చేశా
ABN, Publish Date - Dec 31 , 2023 | 05:28 PM
కల్ట్ బొమ్మ’ టైటిల్‌ను తానెప్పుడో రిజిస్టర్ చేయించుకున్నానని ‘బేబీ’ (Baby) నిర్మాత ఎస్కేఎన్ (SKN) స్పష్టం చేశారు. ఆ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారాయన. కల్ట్ బొమ్మ (Cult bomma) టైటిల్ విషయంలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.
‘కల్ట్ బొమ్మ’ టైటిల్‌ను తానెప్పుడో రిజిస్టర్ చేయించుకున్నానని ‘బేబీ’ (Baby) నిర్మాత ఎస్కేఎన్ (SKN) స్పష్టం చేశారు. ఆ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారాయన. కల్ట్ బొమ్మ (Cult bomma) టైటిల్ విషయంలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ‘‘రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే ఈ టైటిల్‌ను ప్రకటించారా? అంటూ పలువురు మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ‘బేబీ’ రిలీజైనప్పుడు కల్ట్ బొమ్మ అనే పేరు బాగా ప్రమోట్ అయ్యింది. దాంతో నా తదుపరి చిత్రానికి ఆ పేరే పెట్టాలనుకున్నా. కొన్ని నెలల క్రితమే ఆ టైటిల్‌ను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకున్నా. బాధ్యత కలిగిన సినీ నిర్మాతగా.. రిజిస్టర్ చేయించుకోకుండా టైటిల్ ప్రకటించే ఉద్దేశం నాకు లేదు’’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఎస్కేఎన్ ఉన్నట్టుండి ఈ ట్వీట్ చేయడానికి కారణం ఉంది.
విశ్వక్ సేన్ (Viswak sen) నిర్మాతగా వ్యవహరిస్తున్న కొత్త చిత్రం ‘కల్ట్’ (Cult). నూతన నటీనటులతో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేదికగా విలేకర్లు.. ‘‘బేబీ’(Baby)నిర్మాత ఎస్కేఎన్ ఇప్పటికే కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. మళ్లీ మీరు కల్ట్ అని పెడుతున్నారెందుకు?’’ అని విశ్వక్‌ను ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘కల్ట్ బొమ్మనా..? ఆ విషయం నాకు తెలీదు. మేము అయితే కల్ట్ అని రిజిరేస్టషన్ చేయించుకున్నాం. నాకు తెలిసినంత వరకూ కల్ట్కు సంబంధించిన టైటిల్ ఎవరి వద్దా లేదు’’ అని బదులిచ్చారు. విశ్వక్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఎస్కెఎన స్పందించారు.