Chandra Mohan : చంద్రమోహన్ మరణం గురించి మేనల్లుడు ఏం చెప్పారంటే..!
ABN, First Publish Date - 2023-11-11T16:07:20+05:30
సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) అనారోగ్యంతో కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) అనారోగ్యంతో కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. (Chandra Mohan death) చంద్రమోహన్ మరణంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి గల కారణాలను చంద్రమోహన్ బంధువు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. Chandra Mohan death,
‘చంద్రమోహన్‌గారు నాకు స్వయానా మేనమామ. నాలుగేళ్లగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కిడ్నీ సమస్య కూడా తలెత్తింది. ఈ రోజు ఉదయం సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్దారించారు. ఆయన ఇద్దరు కూతుర్లలో ఒకరు చెన్నై నుంచి, మరొకరు అమెరికా నుంచి రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత.. సోమవారం ఆయన అంత్యక్రియలు (Chandra Mohan funeral) నిర్వహిస్తాము’ అని తెలిపారు.
2006లో 'రాఖీ’ సినిమా పూర్తయ్యాక చంద్రమోహన్‌కు బైపాస్ సర్జరీ జరిగింది. 'దువ్వాడ జగన్నాథమ్' సినిమా సమయంలోనూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరగా గోపీచంద్ ‘ఆక్సిజన్’ మూవీలో నటించిన తర్వాత సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. నటుడిగా బిజీగా ఉన్న సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్థ తీసుకోలేదని, నిర్విరామంగా పనిచేస్తూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారని సన్నిహితులు చెబుతుంటారు.