Sivaji Raja: ‘రాజు’లు చాలా మంది ఉంటారు కానీ.. అందులో మంచివారు కొందరే!
ABN, First Publish Date - 2023-05-27T20:06:18+05:30
రాజులు చాలామంది ఉంటారు కానీ అందులో మంచి రాజులు కొంత మందే ఉంటారని అన్నారు నటుడు శివాజీ రాజా. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సంగీత దర్శకుడు రాజ్ సంతాప సభను హైదరాబాద్‌లో తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ అసోసియేషన్ నిర్వహించింది. ఈ సభకు హాజరైన వారంతా రాజ్‌తో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
రాజులు చాలామంది ఉంటారు కానీ అందులో మంచి రాజులు కొంత మందే ఉంటారు అని అన్నారు నటుడు శివాజీ రాజా (Sivaji Raja). తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood)లో ఎన్నో హిట్ సాంగ్స్‌కి సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు రాజ్(63) మే 21న (ఆదివారం) గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. రాజ్ అసలు పేరు తోటకూర వెంకట సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంగీత ప్రపంచానికి రాజ్-కోటిగా మరుపురాని పాటలను అందించారు. రాజ్ (Music Director Raj) మృతి పట్ల సంగీత ప్రియులు, పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు. రాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక రాజ్ మృతికి సంతాపంగా తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సంతాప సభ (Santapa Sabha) ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన పలువురు ప్రముఖులు రాజ్‌తో వారికున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ రాజా (Actor Sivaji Raja) మాట్లాడుతూ.. నాకు రాజ్(Raj)గారు దూరపు చుట్టం అవుతారు. నేను ఆర్టిస్ట్ అవుదామని అనుకుంటున్నప్పుడు మొదటిసారి వెళ్లింది ఆయన ఇంటికే. రాజులు చాలామంది ఉంటారు కానీ అందులో మంచి రాజులు కొంత మందే ఉంటారు. అలాంటి వారిలో ఈ రాజ్‌గారు ఒకరు. ఆయన తండ్రి ఇదే సినీ పరిశ్రమలో చాలా కాలం ఉన్నారు. రాజ్‌గారికి ఎలాంటి అహంకారం కానీ, బేషజాలు కానీ ఉండేవి కావు.. అందరితోనూ చాలా డౌన్ టు ఎర్త్‌గా ఉండే వారు.
ఈ మధ్య ఒక టాప్ డైరెక్టర్ నాతో అన్నారు. రాజ్ కోటి ఉండడం వల్లే ఒక బడా మ్యూజిక్ డైరెక్టర్‌కు తెలుగులో ఎంటర్ కావడానికి ఐదేళ్లు పట్టిందట. నా ప్రొడక్షన్‌లో ఒక సీరియల్ చేయాలని భావించినప్పుడు రాజ్‌గారితో సాంగ్ చేయించాలని ఆయన దగ్గరికి వెళ్లాను. సీరియల్ కథ విని ఆయన కూడా ఒక పాత్ర వేస్తానని అన్నారు. అలా ఆయనతో నాకు చాలా అనుభూతులు ఉన్నాయి. సిసింద్రీ (Sisindri) సినిమా సమయంలో కూడా శివ నాగేశ్వరరావుగారితో కలిసి నన్ను పికప్ చేసుకుని కాస్త సమయం వెచ్చించేవారని తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Vijayashanthi: ఎన్టీఆర్‌తో ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది
*Super Star Krishna: సినిమా వచ్చి 52 ఏళ్లు.. అయినా ఆ కటౌట్స్ చూస్తే..!
*Daana Veera Soora Karna: ఒక్క ఎన్టీఆర్‌కే ఇది సాధ్యం..!
*Adi Seshagiri Rao: ‘అసలు నరేష్ ఎవరు?’.. బాంబ్ పేల్చిన సూపర్ స్టార్ సోదరుడు
*Major: మహేష్ బాబు నిర్మించిన సినిమాకు ఘోర అవమానం