సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mrunal Thakur: సీత ఇంత షాకింగ్ పోజ్ ఇచ్చేసింది ఏంటి బాబోయ్... ఫోటోస్ వైరల్

ABN, First Publish Date - 2023-04-18T14:54:40+05:30

తెలుగులో మొదటి సినిమా 'సీత రామం' తో మృణాల్ ఠాకూర్ పెద్ద స్టార్ అయిపొయింది. ఎన్నో హిందీ సినిమాలు చేసిన ఈమెని తెలుగు ప్రేక్షకులు సీతగా ఎంతో అభిమానించారు. ఆమె మంచి నటి అని కూడా అనిపించుకుంది. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఆమె ఫోటోలు మాత్రం ...

Mrunal Thakur
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పేరు ఇప్పుడు తెలుగు వాళ్లందరికీ చాలా పరిచయమైన పేరు. ఎందుకంటే ఆమె 'సీతారామం' (Sita Ramam)లో వేసిన సీత పాత్ర అంత బలమైనది. సీత అంటే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అనే అనుకున్నారు తెలుగు వాళ్ళు, అంతలా ఆ సినిమాలో ప్రభావం చూపించింది ఆ పాత్ర. ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది. అందులో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) పక్కన కథానాయికగా నటించింది. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దీనికి దర్శకుడు.

మరి అంతటి బలమైన పాత్ర పోషించిన మృణాల్ చాలా హిందీ సినిమాలు కూడా చేసింది, చేస్తోంది కూడా. ఆమధ్య తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఏడుస్తున్న ఫోటో పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. నిన్న చాలా డల్ గా వున్నాను, ఈరోజు మళ్ళీ స్ట్రాంగ్ అయ్యాను అని చెప్పింది.

ఆ తరువాత ఆ ఏడుపుకి వెనకాల కారణాన్ని వివరించింది. చాలామంది ప్రత్యేకంగా ఇప్పుడున్న యువత ఒక యాక్టర్ వెనకాల ఎంత కష్టం ఉందొ గ్రహాయించాలి అని చెప్పింది మృణాల్. వెకేషన్ కి వెళ్ళాం, చాలా సంతోషంగా వున్నాం అని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే వాటి వెంక చాలా కష్టం, కృషి వుంది అని చెప్పింది.

అలాగే చిత్ర పరిశ్రమలోకి ఎవరైనా యువత రావాలనుకుంటే వాళ్ళకి సంకల్పం చాలా అవసరం. ఎందుకంటే తనకి తెలిసిన ఎంతో మంది ఈ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి ఏమీ చెయ్యలేక వెనక్కి వెళ్లిపోయారు. అలా కాకుండా, ఎందుకు వచ్చాము తెలుసుకొని, దానికోసం కష్టపడాలి, పని చెయ్యాలి, లక్ష్యం నెరవేరేటట్టు చూసుకోవాలి అని చెప్పింది.

అప్పట్లో మృణాల్ ఠాకూర్ కూడా 'లవ్ సోనియా' (Love Sonia) అనే సినిమా విడుదల కానప్పుడు, ఇంకా విసిగిపోయి పరిశ్రమ విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకుందట, కానీ మళ్ళీ ఆమె ఏదైనా సాధించాలి అని కంటిన్యూ చేసిందిట. చాల హిందీ సినిమాలు చేస్తున్న, మృణాల్ ఠాకూర్ తెలుగులో ఒక్క సినిమాతోనే పెద్ద స్టార్ అయిపోయింది. ఆమెకి ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయి కానీ, ఆమె ఇప్పుడు నాని (Nani) తో ఒక సినిమా సైన్ చేసింది. ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

మృణాల్ ఠాకూర్ ఫోటోస్ అప్పుడప్పుడూ షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మీ ఫోటోస్ సాంఘీక మాధ్యమాల్లో చాలా వైరల్ అయ్యాయి. అయితే అవి ఆమె వీడియో నుండి కొన్ని ఫోటోస్ తీసి పోస్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది.

Updated Date - 2023-04-18T14:54:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!