Sitara ghattamaneni: టైమ్ స్వ్కేర్‌పై సితార!
ABN, First Publish Date - 2023-07-04T11:13:52+05:30
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టీ సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. తన స్టడీస్, ఆటలు, పాటలు, నృత్యాలు ఇలా ప్రతి విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. సితార చేసిన తొలి కమర్షియల్ యాడ్‌ను ‘సితార కలెక్షన్స్’ పేరుతో న్యూయార్క్ సిటీలోని ప్రఖ్యాత టైమ్ స్వ్కేర్‌పై ఆవిష్కరించారు.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) గారాలపట్టీ సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. తన స్టడీస్, ఆటలు, పాటలు, నృత్యాలు ఇలా ప్రతి విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. ప్రతి విషయంలోనూ సితార తన ప్రతిభను చూపిస్తుంటుంది. అవి చూసిన మహేశ్ ఎంతో మురిసిపోతుంటారు. తాజాగా ఆమె పీఎంజే జువెలరీ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహస్తోంది. సితార (Sitara ghattamaneni) చేస్తున్న తొలి యాడ్ ఇది. ఈ యాడ్ కోసం మూడు రోజులు షూట్ చేశారని టాక్. సంబంధిత ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. Sitara First Commercial Ad)
సితార చేసిన తొలి కమర్షియల్ యాడ్‌ను ‘సితార కలెక్షన్స్’ (Sitara Collections) పేరుతో న్యూయార్క్ సిటీలోని ప్రఖ్యాత టైమ్ స్వ్కేర్‌పై (Time square building) ఆవిష్కరించారు. ఈ విషయాన్ని మహేశ్ సోషల్ మీడియా టీమ్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. లిటిల్ ప్రిన్సెస్ యాడ్‌ను టైమ్ స్వ్కేర్‌పై చూసి మహేశ్ అభిమానులు ఆనందిస్తున్నారు. స్టార్ కిడ్స్‌లో అతి చిన్నవయసులో సితారకు దక్కిన గౌరవమిదన అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మంగళవారం (4, జూలై) అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా తమ అభిమాన హీరో గారాల బిడ్డను టైమ్స్వ్కేర్లో చూడడం గర్వంగా ఉందని అభిమానులు సందడి చేస్తున్నారు. అంతే కాదు అతి చిన్న వయసులో కమర్షియల్ యాడ్ స్టార్ కిడ్స్‌గా సితార గుర్తింపు పొందింది. దీంతో మహేశ్ కుటుంబం క్లౌడ్‌నైన్‌లో ఉంది.