సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Venky Atluri: వైభవంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి పెళ్లి

ABN, First Publish Date - 2023-02-01T16:38:34+05:30

తొలి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి (Venky Atluri). తాజాగా ఆయన పెళ్లి చేసుకున్నారు. పూజ అనే అమ్మాయితో కలసి ఏడడుగులు వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి (Venky Atluri). తాజాగా ఆయన పెళ్లి చేసుకున్నారు. పూజ అనే అమ్మాయితో కలసి ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin), హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh), డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula), ప్రొడ్యూసర్ స్వప్న దత్ (Swapna Dutt) తదితరులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జంటతో తీసుకున్న ఫొటోను నితిన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న వెంకీ స్వామికి శుభాకాంక్షలు. పూజతో నీ జీవితం మరెంతో అందంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని నితిన్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

వెంకీ కుడుముల ‘జ్ఞాపకం’ సినిమాలో హీరోగా నటించారు. అనంతరం ‘స్నేహాగీతం’, ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ చిత్రాలకు రైటింగ్ విభాగంలో పనిచేశారు. మాటల రచయితగా సేవలు అందించారు. అనంతరం డైరెక్టర్‌గా మారారు. ‘తొలి ప్రేమ’ (Tholi Prema)కు దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా హీరో, హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌తో ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ లను తెరకెక్కించారు. ప్రస్తుతం ధనుష్‌తో ‘సార్’ (Sir) ను తీస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

Updated Date - 2023-02-01T16:43:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!