Singer Damini - Bigg Boss 7 : ఎలిమినేట్‌కి కారణం అదేనా.. దామిని ఏం చెప్పిందంటే!
ABN, First Publish Date - 2023-09-30T18:16:17+05:30
'బాహుబలి’ (Bahubali) చిత్రంలోని పచ్చబొట్టేసిన సాంగ్ మీద సింగర్ దామిని (Damini) బిగ్‌బాస్ హౌస్ (Biggboss) అడుగుపెట్టిన సంగతి తెలిసిందే! మొదటివారం కాస్త డల్‌గా ఆడినా రెండోవారం నుంచి పికప్ అయింది. ఆ రెండువారాల ఆట బాగానే ఆడింది.
'బాహుబలి’ (Bahubali) చిత్రంలోని పచ్చబొట్టేసిన సాంగ్ మీద సింగర్ దామిని (Damini) బిగ్‌బాస్ హౌస్ (Biggboss) అడుగుపెట్టిన సంగతి తెలిసిందే! మొదటివారం కాస్త డల్‌గా ఆడినా రెండోవారం నుంచి పికప్ అయింది. ఆ రెండువారాల ఆట బాగానే ఆడింది. రెండోవారం నామినేషన్సలో కూడా లేదు. ఓటింగ్ కూడా బాగానే ఉంది. కానీ మూడోవారంలో ఊమించని రీతిలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అయితే ఎక్కడో ప్రేక్షకుల మనసును గెలుచుకోలేకపోయిందని అర్థమైంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దామిని చంద్రభట్ల ఆసక్తికర విషయాలు పంచుకుంది.
బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన ముచ్చట్లను బయటకు చూపించని విషయాలను దామిని చెప్పుకొచ్చింది. ‘‘నేను శాఖాహరిని. కాకపోతే గుడ్డు తింటాను. మా ఇంట్లో చికెన్‌తో పనే ఉండదు. అలాంటిది నేను తొలిసారి బిగ్‌బాస్ హౌస్‌లో చికెన్ కర్రీ వండాను. కానీ అది ప్రసారం చేయలేదు. ఓ టాస్క్‌లో ప్రిన్స్ యావర్ ఫేస్ మీద పేడ కొట్టాను. టాస్క్ పూర్తవగానే సారీ చెప్పి తనకు తలంటు పోశాను, అది కూడా టెలికాస్ట్ చేయలేదు. వినాయక చవితి సమయంలో ప్రిన్స్.. షేర్వాణీ వేసుకుని వచ్చి అక్షింతలు వేసి ప్రసాదం తిన్నాడు. అది చూసి నేను ఆయన భుజం తట్టి నిన్ను చూస్తే గర్వంగా ఉందని మెచ్చుకున్నాను. అదీ టీవీలో రాలేదు. తర్వాత నేను సందీప్ మాస్టర్‌తో యావర్ వయొలెంట్‌గా ఉంటాడు కానీ కొన్ని మంచి గుణాలున్నాయి. వినాయక చవితికి అక్షింతలు వేశాడు అని గొప్పగా చెప్పాను. అందులో నేను మాట్లాడిందంతా ఎడిట్ చేసి అక్షింతలు వేశాడని చెప్పింది మాత్రమే చూపించారు. దానివల్ల నేనేదో అతడి గురించి చెడుగా మాట్లాడినట్లుగా అర్థం చేసుకున్నారు. అలా నామీద చాలా వ్యతిరేకత వచ్చిందని బయటకు వచ్చిన తర్వాత తెలిసింది’’ అని పేర్కొంది దామిని.
ఇంకా చెబుతూ 'బాహుబలి’ సినిమాలో పచ్చబొట్టేసినా.. అని పాట పాడి పాపులర్ అయ్యాను. ఇంతవరకూ నా ఒంటిపై ఒక్క పచ్చబొట్టు కూడా లేదు. నాకిష్టమైన ప్రదేశానికి వెళ్లి టాటూ వేయించుకోవాలని చూస్తున్నాను. ఏదైనా స్పెషల్ మూమెంట్ వచ్చినప్పుడే అది చేస్తాను. నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం. కొన్నాళ్లు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈరోజుల్లో సహజీవనం చేేస్త తప్పేం లేదు. అలాంటి పరిస్థితి వస్తే ఇంట్లో వాళ్ల అనుమతి తీసుకున్నాకే లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటాను. అమ్మానాన్న నన్ను చాలా అర్థం చేసుకుంటారు. అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు’ అని దామిని చెప్పింది.