Simhadri: 'సింహాద్రి' రి-రిలీజ్ కి ఎంత ఖర్చుపెడుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు
ABN, First Publish Date - 2023-05-06T15:57:13+05:30
ఈమధ్య అగ్ర నటుల సినిమాలు రే-రిలీజ్ లు ఎక్కువయ్యాయి. ఆ కోవలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'సింహాద్రి' సినిమా మే 20 న విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రచారాల కోసం ఎంత ఖర్చుపెడుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు
ఎన్టీఆర్ (NTR), దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్ లో వచ్చిన 'సింహాద్రి' #Simhadri ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో అది ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. ఇందులో ఎన్టీఆర్ పక్కన, భూమిక (BhumikaChawla), అంకిత (Ankitha) కథానాయకులుగా నటించారు. #Simhadri4K ఇందులో పాటలు కూడా పెద్ద హిట్. ఈ సినిమాని మళ్ళీ ఈనెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు (NTRBirthday) సందర్భంగా విడుదల చేస్తున్నారు. అయితే ఈ విడుదల చాలా పెద్దగా ఒక మామూలు సినిమా ఎలా చేస్తారో అంత లెవెల్లో చేస్తున్నారు.
ఈ సినిమాని, అమెరికాతో పాటు దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా విడుదల చేస్తున్నారు. #Simhadri4KOnMay20 ఇలా ప్రపంచ వ్యాప్తంగా రి-రిలీజ్ అవటం మొదటి సారని అంటున్నారు. అదీ కాకుండా ఈ సినిమా ప్రచారానికి కూడా బాగానే ఖర్చు చేస్తున్నారు. #Simhadri4KOnMay20 సుమారు రూ. 2 కోట్ల (Rs 2 crore for publicity) రూపాయలు ప్రచారానికి మాత్రమే పెడుతున్నారు అంటే, ఈ సినిమాని ఎంత భారీగా మళ్ళీ విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారో అర్థం అవుతుంది.
రేపు మే 7 వ తేదీ సాయంత్రం 5.31 నిముషాలకి ఆర్టీసీ క్రాస్ (RTC Cross Roads) రోడ్స్ దగ్గర సుదర్శన్ 35 ఎంఎం (Sudarshan35MM) లో ఈ సినిమాలోని "నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి" అనే పాటను ప్రదరిస్తారు. అభిమానులు దీనికే చాలా ఉత్సాహగానా సాంఘీక మాధ్యమాల్లో చాలా హడావిడి చేస్తున్నారు. 'సింహాద్రి మాస్ జాతర మొదలైంది' అని అంటున్నారు. ఇలా వీటన్నితోపాటు జపాన్ లో కూడా ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా సుదర్శన్ థియేటర్ లో టెస్టింగ్ కూడా చేశారు, 4కె విడుదలకి అన్నీ సిద్ధం అని కూడా అభిమానులు సాంఘీక మాధ్యమం లో చెప్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే, ఇంకా 'సింహాద్రి' టి షర్ట్స్, కాప్స్ ఇలా ఒకటేమిటి చాలా వచ్చేసాయి. ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు కూడా చాలా భారీగానే ఉండేట్టు చూస్తున్నారు. ఇలా అసలు ఈమధ్య కాలంలో ఈ సినిమాకి లేనంత హైప్ ఈ సినిమా రి-రిలీజ్ కి చేస్తున్నారు అని కూడా పరిశ్రమలో అంటున్నారు.