కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Silk Smitha: సిల్క్‌ జీవిత కథ.. హీరోయిన్ ఎవరంటే!

ABN, First Publish Date - 2023-12-02T15:06:05+05:30

గ్లామర్‌ డాల్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సిల్క్‌స్మిత (Silk Smitha) అలనాటి స్టార్‌ హీరోలతో ఎన్నో ఐటెమ్‌ సాంగ్స్‌లో నటించారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

గ్లామర్‌ డాల్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సిల్క్‌స్మిత (Silk Smitha) అలనాటి స్టార్‌ హీరోలతో ఎన్నో ఐటెమ్‌ సాంగ్స్‌లో నటించారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. వృత్తిపరంగానూ, వైవాహిక జీవితంలోనూ చేదు సంఘటనలు ఎదుర్కొన్న ఆమె 1996 సెప్టెంబర్‌ 23న ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘డర్టీ పిక్చర్‌’ తెరకెక్కింది. సిల్క్‌స్మితగా విద్యాబాలన్‌ నటించారు. ఇప్పుడు మరోసారి సిల్క్‌ జీవిత కథ తెరపై కనిపించనుంది. చంద్రికా రవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జయరామ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘సిల్క్‌ స్మిత.. ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ పేరుతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం సిల్క్‌ స్మిత జయంతిని పురస్కరించుకుని చిత్రబృందం తాజాగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇందులో చంద్రిక.. సేమ్‌ స్మితలాగే కనిపించారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. చంద్రికా రవి ‘వీర సింహారెడ్డి’ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి మెప్పించారు.  

Updated Date - 2023-12-02T15:07:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!