సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rashmika Mandanna: క్రష్ అన్నాడా శుభ్‌మన్ గిల్... అసలు ఏమైంది

ABN, First Publish Date - 2023-03-09T15:23:44+05:30

యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తరచూ వార్తల్లో వుంటున్నారు. ఒకసారి సచిన్ టెండూల్కర్ కూతురు సారా తో, ఇప్పుడు నటి సారా అలీ ఖాన్ తో, మరి రష్మిక తో ఎందుకు అతను వార్తల్లో వున్నాడు అంటే ఇది చదవండి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రికెట్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఈమధ్య చాలా పాపులర్ అయ్యాడు. ఎందుకంటే, భారత జట్టు కి ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ ఈమధ్య తన వీర ప్రతాపాన్ని చూపించి వన్ డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసాడు. ఈ యువ క్రికెటర్ బాగా పాపులర్ అయ్యాడు, అతను సినిమా అభిమానులకు కూడా సుపరిచితుడు. ఎందుకంటే ఈమధ్య గిల్, నటి సారా అలీ ఖాన్ (Sara Ali Khan) ఇద్దరూ ఒక రెస్టారెంట్ లో ఉండగా బయటికి వచ్చిన ఫోటోస్, వీడియోస్ వైరల్ అయ్యాయి. అలాగే గిల్, సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూతురు సారా (Sara Tendulkar) తో కూడా ప్రేమలో పడ్డాడు అని ఆమధ్య మీడియా లో చాలా కథనాలు వచ్చాయి కూడా.

అయితే ఇప్పుడు శుభ్‌మన్ గిల్ కి పుష్ప (Pushpa) సినిమాలో నటించిన రష్మిక మందన్న (Rashmika Mandanna) కి కూడా ఎదో జరిగిందని వార్తలు రాస్తున్నారు. ఒక మీడియా సమావేశం లో మీకు ఏ నటి మీద క్రష్ వుంది అని అడిగితే, తడుముకోకుండా వెంటనే ఠక్కుమని రష్మిక (Rashmika) అని చెప్పాడట శుభ్‌మన్ గిల్. ఈ వార్త ఆలా ఎలా వైరల్ అయి చివరకి శుభ్‌మన్ గిల్ దానికి సంజాయిషీ ఇచ్చుకునే వరకు వచ్చింది. అయితే రష్మిక వెంటనే ఈ సమాధానానికి ఏదైనా రెస్పాన్స్ అవుతుందేమో అని చూసారు, కానీ ఆమెకన్నా ముందే శుభ్‌మన్ గిల్ దీనికి సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

అసలు నేనెప్పుడూ మీడియా సమావేశం లో మాట్లాడినా నాకే తెలీదు. నాకు తెలియకుండా నేను ఏ మీడియా సమావేశం లో మాట్లాడేను అని శుభ్‌మన్ గిల్ వివరణ ఇచ్చుకున్నాడు. దానితో ఈ సమస్య ఇక్కడితో సమసి పోయింది అని అనుకున్నాడు. కానీ సారా అలీ ఖాన్ తో మాత్రం, శుభ్‌మన్ గిల్ తరచూ కనపడుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఒకసారి ఢిల్లీ లో కూడా ఇద్దరూ ఒక రెస్టారెంట్ లో కనపడ్డారు అనీ, అలాగే ఇద్దరూ ఒకే విమానం లో కూడా కనపడ్డారు అనీ వార్తలు వస్తున్నాయి. అలాగే ఒక పంజాబీ టాక్ షో లో ఎవరి ఫిట్ గా వుండే నటి అని అడిగితే, సారా అని టక్కున చెప్పాడట శుభ్‌మన్ గిల్.

ఇంతకీ ఆసక్తికరం ఏంటి అంటే, శుభ్‌మన్ గిల్ ఇంతకు ముందు లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూతురుతో రిలేషన్ షిప్ లో వున్నదని వార్తలు వచ్చాయి, చక్కర్లు కొట్టాయి కూడా. మరి ఆ బంధం తెగిపోయిందో, ఇంకా ఉందో చూడాలి. వయసు అలాంటింది మరి, తన కెరీర్ చాలా బాగా నడుస్తున్న ఈ టైములో ఇటువంటి వి అవసరమా అని కొందరు అంటున్నారు కూడా. పూర్తిగా ఫోకస్ క్రికెట్ మీద పెడితే మంచిది అని కొందరు సలహా కూడా ఇస్తున్నారు.

Updated Date - 2023-03-09T15:23:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!