Shruti Haasan : నటిని కాకుంటే ఒళ్లంతా వేయించుకునేదాన్ని!
ABN, First Publish Date - 2023-09-15T16:38:34+05:30
ఈ ఏడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకుంది. విశ్వనాయకుడు కమల్‌హాసన్ కూతురు శ్రుతీహాసన్. ఇప్పుడు ప్రభాస్ ‘సలార్’తో (Salaar) సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
ఈ ఏడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకుంది. విశ్వనాయకుడు కమల్‌హాసన్ కూతురు శ్రుతీహాసన్. ఇప్పుడు ప్రభాస్ ‘సలార్’తో (Salaar) సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అలాగే నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘హాయ్ నాన్న’లోనూ శ్రుతి హాసన్ (Shruti Haasan) అతిథి పాత్రలో కనిపించనుంది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. స్టార్ హీరోయిన్ కూతురు అయుండి కూడా ఎందుకు అంతగా కష్టపడతారు అన్న ప్రశ్నకు ‘నేను స్టార్‌ని కాదు. మానాన్న పెద్ద హీరో. నేను సంపాదించింది మాత్రమే నాది అని భావిస్తా. అందుకే కష్టపడతా. ఒక నటిగా నా పాత్రకు నేను న్యాయం చేయాలనుకుంటాను. నటించడం, పాడడం.. ఇలాంటివి నాకు చాలా ఇష్టం’’ అని తెలిపింది.
‘‘నేను సినిమాల్లోకి రాకపోతే సేల్స్ గర్ల్‌గా పని చేసేదాన్ని. నాకు చిన్నప్పుడు సేల్స్ గర్ల్ కావాలని కోరిక. అందుకే ఏ దుస్తుల దుకాణానికి వెళ్లినా అక్కడ కస్టమర్లతో చాలా మాట్లాడుతూ సమయం గడిపేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక ఆ ఆలోచన మారిపోయింది. ఇక నాకు టాటూల పిచ్చి. నా 19వ సంవత్సరంలోనే టాటూ వేయించుకున్నా. ఒకవేళ నటిని కాకుంటే ముఖం మీద కాకుండా ఒంటినిండా టాటూలు వేయించుకునేదాన్ని’’ అని చెప్పుకొచ్చింది. అంతు కాదు తను సున్నిత మనస్కురాలని, చిన్న విషయానికి కూడా ఏడుస్తానని తెలిపింది. కాకపోతే అందరిలో ఏడవడం ఇష్టం ఉండదని చెప్పింది.
పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు ‘దయచేసి బోరింగ్ ప్రశ్నలు అడగొద్దు’ అంటూనే శాంతనుతో ప్రేమాయణం గురించి చెప్పింది. ‘తన ఆర్ట్ వర్క్ నచ్చి ఇన్‌స్టాలో ఫాలో అయ్యాను. అలా మొదలైన నా పరిచయం ప్రేమ వరకూ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే మా ప్రేమ పుట్టింది.