Shree Leela : అమ్మాయికి అది కూడా అవసరమే!
ABN, First Publish Date - 2023-11-17T11:42:41+05:30
టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకెళ్తుంది శ్రీలీల (Shree leela). ఓ పక్క టాప్ హీరోలతో సినిమాలు చేస్తూనే ఎంబీబీఎస్ కూడా చదువుతోంది. గత నెల 'భగవంత కేసరి’ చిత్రంలో విజ్జి పాపగా 9Vijji papa) అలరించిన శ్రీలీల ఈ నెల ‘ఆదికేశవ’ (Adikesava) చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనుంది.
టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకెళ్తుంది శ్రీలీల (Shree leela). ఓ పక్క టాప్ హీరోలతో సినిమాలు చేస్తూనే ఎంబీబీఎస్ కూడా చదువుతోంది. గత నెల 'భగవంత కేసరి’ చిత్రంలో విజ్జి పాపగా (Vijji papa) అలరించిన శ్రీలీల ఈ నెల ‘ఆదికేశవ’ (Adikesava) చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది. ఎంబీబీఎస్ చదవడం గురించి తెలిపింది.
‘‘డాక్టర్ కావాలన్నది చిన్నప్పటి కల. డాక్టర్ అవుతానని ఇంట్లో వాళ్లకు మాటిచ్చా. ఆ మాట నిలబెట్టుకుంటా. నటిగా ఉంటూనే ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నా. నటిగా ప్రేక్షకులను అలరించటాన్ని, వేలమంది అభిమానుల అభిమానాన్ని పొందటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. దాంతోపాటు డాక్టర్ కావడం అనేది నా తొలి ప్రాధాన్యం. అయితే నా ఒపీనియన్ ప్రకారం.. ప్రతి అమ్మాయికీ వృత్తిపరంగా అలాంటి బ్యాకప్ తప్పక ఉండాలి. నటిగా నా అభినయంతో.. లేదంటే వైద్యురాలిగా చికిత్స అందించడం ద్వారా ప్రజల స్వాంతన ఇవ్వాలనుకుంటున్నా’’ అని తెలిపారు.
శ్రీలీల (Shree leela) ప్రస్తుతం ‘ఆదికేశవ’, ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగతసింగ్’, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాల్లో నటిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆదికేశవ’ నవంబర్ 24న విడుదల కానుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడు.