Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఎంత ఖర్చు చేశారంటే?
ABN, First Publish Date - 2023-03-18T19:29:59+05:30
టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.
టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుంది. అయితే, అకాడమీ అవార్డ్స్‌కు నామినేట్ కావడంతో ఈ కార్యక్రమానికి జక్కన్న, తారక్, రామ్ చరణ్‌తో సహా చిత్ర బృందానికి చెందిన ఇతర వ్యక్తులు హాజరయ్యారు. కానీ, ఆస్కార్ నిర్వహకులు మాత్రం వీరెవరికి కార్యక్రమాన్ని వీక్షించడానికి టిక్కెట్స్ ఇవ్వలేదని తెలుస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్. కీరవాణి (MM. Keeravani), గీత రచయిత చంద్ర బోస్ (Chandrabose) వారి భాగస్వాములకు మాత్రం అకాడమీ ఉచిత ప్రవేశం కల్పించింది. చిత్ర బృందానికి చెందిన ఇతర వ్యక్తులు మాత్రం డబ్బులు చెల్లించి టిక్కెట్స్‌ను కొనుగోలు చేయాలని చెప్పినట్టు సమాచారం. దీంతో తనతో పాటు ఇతర చిత్ర బృందానికి జక్కన్న టిక్కెట్స్‌ను కొనుగోలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ ఒక్క టిక్కెట్ ధర రూ.20.6లక్షలు ఉంటుందని తెలుస్తోంది. అందువల్ల హాల్‌లోని చివరి వరుసలో వారు కూర్చున్నారు. అవార్డును అందుకునే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అకాడమీ ఉచిత పాస్‌లను అందజేస్తుంది. మిగతా సభ్యులెవరైనా సరే వారు డబ్బులు చెల్లించి టిక్కెట్స్‌ను కొనాల్సిందే. ఆస్కార్ మహోత్సవానికి ‘ఆర్ఆర్ఆర్’ టీం తరఫున ఎస్‌ఎస్. రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయ, రామ్ చరణ్, ఉపాసన, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు హాజరయ్యారు.
^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
NTR 30: తుఫాను హెచ్చరిక.. పండగ లాంటి వార్త వచ్చేసింది..
Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!
RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!
Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు
Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!