Urvashi Rautela: డ్రస్ కోసమే అంతంటే... మరి పాటకు ఎంత?
ABN, First Publish Date - 2023-04-28T17:59:20+05:30
నటి ఊర్వశీ రౌతెల గురించి నెట్టింట ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఆమె అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’ చిత్రంలో ప్రత్యేక గీతంలో మెరిశారు.
నటి ఊర్వశీ రౌతెల (Urvashi Rautela) గురించి నెట్టింట ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఆమె అఖిల్ అక్కినేని (Akhil akkineni) హీరోగా నటించిన ‘ఏజెంట్’ (Agent) చిత్రంలో ప్రత్యేక గీతంలో మెరిశారు. ‘వైల్డ్ సాలా’ (Wild saala) అంటూ సాగే పక్కా మాస్‌గా పాటతో యువతను ఉర్రూతలూగించారు. టూ పీస్ డ్రస్‌లో ఎలక్ర్టిఫైయింగ్ ఎనర్జీతో సాగే పాటలో ఆల్ర్టా గ్లామరస్ అవుట్‌లుక్‌తో మెప్పించారు. ఆ పాటలో ఊర్వశీ ఆల్ర్టా గ్లామరస్ అవుట్‌లుక్‌లో కనిపించడానికి నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారట. దుస్తుల ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అంటున్నారు. (20 lakhs for Urvashi Rautela Dress)
ప్రముఖ స్టైలిస్ట్ కెన్ ఫెర్న్స్ డిజైన్ చేసిన ఆ దుస్తుల ఖరీదు అక్షరాల రూ.20లక్షలు. నూయార్క్‌లోని రెట్రోఫ్రెట్ బ్రాండ్‌లో రూపొందినవి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దుస్తుల గురించే చర్చ నడుస్తోంది. టూ పీస్ డ్రస్ కోసం రూ.20 లక్షలు ఖర్చు చేశారా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డ్రస్ కోసమే అంత ఖర్చు చేశారంటే.. ఇక ఊర్వశీకి పారితోషికంగా భారీగానే సమర్పించుకునే ఉంటారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
సంక్రాంతి బరిలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో ‘బాస్ పార్టీ’ సాంగ్‌తో యువత హృదయాలను దోచుకుంది ఊర్వశీ. ఇప్పుడు అఖిల్ సరసన ‘వైల్ సాలా’ పాటతో మరోసారి మెప్పించింది. బోయపాటి శ్రీను - రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ ఊర్వశీ రౌతెల ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు.